చంద్రబాబుపై చిత్తూరు ఎంపి తిరుగుబాటు చేస్తున్నారా?

Published : Apr 14, 2017, 07:08 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
చంద్రబాబుపై చిత్తూరు ఎంపి తిరుగుబాటు చేస్తున్నారా?

సారాంశం

ఎంపి చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఎంపి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతోంది.

చంద్రబాబునాయుడుపై చిత్తూరు ఎంపి శివప్రసాద్ తిరుగుబాటు లేవతీస్తున్నారా. ఆయన మాటలను చూస్తుంటే రహస్య అజెండాతోనే ఎంపి మాట్లాడుతున్నట్లే కనబడుతోంది. ఈరోజు ఎంపి మాట్లాడుతూ చంద్రబాబుపై బాగా డ్యమేజింగ్ వ్యాఖ్యలు చేసారు. శివప్రసాద్ వ్యాఖ్యలు వెలుగు చూడ్డంతో టిడిపి నేతలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు ఎస్సీలకు తీరని అన్యాయం చేస్తున్నట్లు ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో దళితుల భూములు తీసుకున్న ప్రభుత్వం వారిని కూలీలుగా మార్చేసిందంటూ ధ్వజమెత్తారు.

ఎస్సీ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతికి హాజరుకాకుండా చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా దళితులను తీవ్రంగా అవమానిస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వం దళితులను ఉద్దేశ్యపూర్వకంగానే అవామినిస్తోందని మండిపడ్డారు. ఏడాది పొడుగునా అంబేద్కర్ ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం మరచిపోయిందంటూ రెచ్చిపోయారు.  దలిత ప్రయోజనాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే చూస్తు ఊరుకునేది లేదంటూ చేసిన హెచ్చిరకలు పార్టీలో, ప్రభుత్వంలో సంచలనంగా మారింది. ఇదంతా శివప్రసాద్ ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

అయితే, పార్టీలో ఎంపి మాటాలపై భిన్న స్పందనలు వినబడుతున్నాయి. కొంతకాలంగా ఎంపిపై భూ ఆక్రమణల ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. వాటిపై విచారణ చేయించాలంటూ స్వయంగా చంద్రబాబే కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే, కొంతకాలంగా చంద్రబాబు తనను ఉద్దేశ్యపూర్వకంగానే పక్కన బెట్టారనే అభిప్రాయంలో శివప్రసాద్ ఉన్నారు. తిరుపతిలో ఆమధ్య తన కూతురుకు, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సమీప బంధువు కారు డ్రైవర్ కు మధ్య జరిగిన వివాదంలో కూడా చంద్రబాబు జోక్యం చేసుకోలేదన్న ఆగ్రహంతో ఎంపి ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎంపి చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఎంపి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతోంది.

 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu