శిల్పాపై ప్రభుత్వం కక్ష సాధింపు

First Published Nov 18, 2017, 8:58 PM IST
Highlights
  • నంద్యాల వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డిపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగింది.

నంద్యాల వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డిపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగింది. ఆయనకున్న గన్ మెన్లను తొలగించటం ద్వారా తన ఉద్దేశ్యమేమిటో తెలియజేసింది. శిల్పాతో పాటు నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ సులోచన గన్ మెన్లను కూడా తొలగించటం గమనార్హం. ఇద్దరికీ గన్ మెన్లను తొలగించటం నంద్యాలలో పెద్ద చర్చనీయాంశమైంది.

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తుండగానే పై ఇద్దరు నేతలకు గన్ మెన్లను తొలగించటం పట్ల వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. పాదయాత్ర విజయవంతమవటంలో శిల్పా సోదరులు కూడా బాగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్న కారణంగానే వీరిద్దరిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

మొన్నటి ఉపఎన్నికలో శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ తరపున నంద్యాల లో పోటీ చేసిన సంగతి అందరకీ తెలిసిందే. అప్పటి నుండే శిల్పా పట్ల ప్రభుత్వం కక్ష సాదింపులకు దిగింది. ఎప్పటి నుండో శిల్పా కుటుంబం నడుపుతున్న సూపర్ మార్కెట్ ను కూడా ఎన్నికల సమయంలోనే మూయించేసింది. అదే సమయంలో సోదరుడు, ఎంఎల్సీ చక్రపాణి రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. దాంతో సోదరులిద్దరిపైన ప్రభుత్వం అప్పటి నుండి కక్ష సాధింపులకు దిగుతోంది. అందులో భాగమే గన్ మెన్లను తొలగించటం.

 

 

 

 

click me!