ప్యారడైజ్ పేపర్లలో అగ్రిగోల్డ్ నిందుతుల పేర్లా ?

First Published Nov 18, 2017, 10:34 AM IST
Highlights
  • ప్యారడైజ్ పేపర్లలో అగ్రిగోల్డ్ నిందుతుల పేర్లున్నాయన్న ప్రచారం సంచలనంగా మారింది.

ప్యారడైజ్ పేపర్లలో అగ్రిగోల్డ్ నిందుతుల పేర్లుండటం సంచలనంగా మారింది. భeరీ పెట్టుబడులు పెట్టారంటూ వ్యవస్ధాపకుల పేర్లు  బయటపడటం సంచలనంగా మారింది. కెమెన్ ఐల్యాండ్స్ లో షార్ ఫ్రంట్ హోల్డింగ్స్ పేరుతో 2009లోనే పెట్టుబడులు పెట్టారట. అవ్వా వెంకటరమణ, వెంకట సుబ్రమణ్యం, శర్మల పేర్లతో పెట్టుబడులున్నాయంటూ ప్రచారం మొదలైంది.  కంపెనీల నిర్వహణ బాధ్యతల్లో అవ్వా ఉదయ్ భాస్కర్ వ్యవహరిస్తున్నారు. కాగా పెట్టుబడిదారులను మోసం చేశారన్న అభియోగాలపై 2016లో అగ్రిగోల్డ్ పై సిఐడి కేసులు నమోదు చేసిన విషయం అందరకీ తెలిసిందే.

బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కోర్టు అనుమతితో అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసే ప్రక్రియను చేపట్టింది. దాదాపు రూ. 7 వేల కోట్ల మేరకు సంస్ధకు అప్పులున్నాయి. ఆస్తులు అంతకంటే ఎక్కువే ఉన్నాయనుకోండి అది వేరే సంగతి. అగ్రిగోల్డ్ లో పెట్టుబడులు పెట్టిన లక్షలాది మందికి వారి పెట్టుబడులను తిరిగి వాపసు చేసే విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందుకోసం సంస్ధకున్న అప్పులతో పాటు ఆస్తులను కూడా తీసుకునే వారి కోసం ప్రభుత్వం వెతుకుతోంది. అందుకు కొందరు సానుకూలంగా స్పందిచారు కూడా. కోర్టు అనుమతితో వారితో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

ఇదిలావుండగా, ఆమధ్య అగ్రిగోల్డ్ కు చెందిన విలువైన భూములను మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు తో పాటు ఎంఎల్ఏలు దూళిపాళ్ళ నరేంద్ర, పయ్యావుల కేశవ్ తదితర టిడిపి ప్రముఖులు కారు చౌకగా కొనేసారంటూ వైసీపీ ఆరోపణలు చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్యారడైజ్ పేపర్లలో ఉందని టిడిపి చేస్తున్న ఆరోపణలు కూడా అందరికీ తెలిసిందే. రాజకీయంగా కూడా పలు వివాదాలను రేకెత్తించిన అగ్రిగోల్డ్ నిందుతుల పేర్లు తాజాగా ప్యారడైజ్ పేపర్లలో ఉన్నాయన్న ప్రచరంతో కలకలం రేగుతోంది. అయితే, ఏ స్ధాయిలో లావాదేవీలు నడిపారన్న విషయం స్పష్టత లేదు.

 

click me!