పులిచింతలలో నీటి మట్టం తగ్గింపునకు చర్యలు: స్టాప్ గేటు బిగింపునకు చర్యలు ప్రారంభం

By narsimha lode  |  First Published Aug 6, 2021, 12:17 PM IST

పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు విరిగిపోవడంతో స్టాప్ గేటు బిగించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు ప్రారంభించారు. అయితే  ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గితేనే ఈ లాక్ బిగించేందుకు అవకాశం ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు నుండి  నీటిని ఖాళీ చేస్తున్నారు.
 


గుంటూరు: పులిచింతల ప్రాజెక్టుకు 16వ గేటు విరిగిపోవడంతో దాని స్థానంలో స్టాఫ్ లాక్‌ ఏర్పాటు చేసేందుకు ఇరిగేషన్ అధికారులు యుద్దప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు. ప్రాజెక్టులో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గితేనే స్టాఫ్ లాక్ ను బిగించే అవకాశం ఉంటుంది.స్టాప్ గేటు బిగించేందుకు నిపుణులు ప్రాజెక్టు వద్దకు చేరుకొన్నారు.

also read:పులిచింతలలో ఊడిపోయిన గేట్.. రేపటిలోగా సరిచేస్తాం, ప్రమాదంపై నిపుణులతో కమిటీ: మంత్రి అనిల్ కుమార్

Latest Videos

పులిచింతల ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి 1.67 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో  19 గేట్లను ఎత్తి దిగువకు  నీటిని వదులుతున్నారు.పులిచింతల ప్రాజెక్టులో స్టాప్ గేటు నిర్మించాలంటే ప్రాజెక్టులో 10 టీఎంసీల నీటిని ఖాళీ చేయాలి.  పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజీకి  సుమారు 5 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది.

దీంతో నది పరివాహక ప్రాంత ప్రజలలను అధికారులు అప్రమత్తం చేశారు.ప్రాజెక్టు నుండి భారీగా నీరు చేరడంతో రెండు అడగుల మేర గేట్లు ఎత్తే క్రమంలో గురువారం నాడు 16వ గేటు విరిగిపోయింది. ఈ గేటు విరిగిపోవడంతో భారీగా నీరు దిగువకు విడుదల అవుతోంది. పులిచింతల ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి సుమారు 5 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

click me!