బర్త్ డే సెలబ్రేషన్స్ పేరిట..కాల్ గర్ల్స్ ని పిలిపించి..!

Published : Jun 26, 2021, 12:16 PM IST
బర్త్ డే సెలబ్రేషన్స్ పేరిట..కాల్ గర్ల్స్ ని పిలిపించి..!

సారాంశం

ఓ హోటల్ లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో కాల్ గర్ల్స్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. దాడులు చేసి వారిని అరెస్టు చేశారు. 


స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని అనుకున్నారు. అందుకోసం ప్రత్యేకంగా బెంగళూరు నుంచి కాల్ గర్ల్స్ ని రప్పించారు. అయితే..  ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో.. వారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా అరండల్ పేటలోని ఓ హోటల్ లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో కాల్ గర్ల్స్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. దాడులు చేసి వారిని అరెస్టు చేశారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ముగ్గురు వ్యక్తులు..  బెంగళూరు నుంచి అమ్మాయిలను తీసుకువచ్చినట్లు గుర్తించారు.

ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులు, ముగ్గురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను పునరావస కేంద్రానికి తరలించారు. అయితే.. రేవ్ పార్టీ ఏమైనా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ నిర్వాహకులను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu