ఇంటర్ పోల్ అదుపులోకి వైఎస్ జగన్, కాళ్లు పట్టుకున్నారు: బుచ్చయ్య

By telugu team  |  First Published Feb 16, 2020, 8:24 PM IST

టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసుల నుంచి బయటపడడానికి వైఎస్ జగన్ ఢిల్లీలో వాళ్ల కాళ్లు పట్టుకుంటున్నారని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ఇంటర్ పోల్ అధికారులు త్వరలో అదుపులోకి తీసుకోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత బుచ్చయ్య చౌదరి అన్నారు. అనవసర విషయాల్లో తమ పార్టీ అధినేత చంద్రబాబుపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న జగన్ అరాచకవాది అని ఆయన అన్నారు. 

వైసీపీ నేతలు పలు సంస్థల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ను నమ్మి ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ప్యాకేజీ విషయంలో ఒప్పించలేకపోయారని, ఆ దిశగా జగన్ ప్రయత్నాలు కూడా చేయడం లేదని ఆయన అన్నారు. 

Latest Videos

కేసుల నుంచి బయటపడేందుకే జగన్ ఢిల్లీ వెళ్లి అక్కడివారి కాళ్ల మీద పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గతంలో సీబీఐ విచారణ కోరిన జగన్ ఇప్పుడు వెనక్కి తగ్గడంలో ఆంతర్యమేమిటని అయన ప్రశ్నించారు.

పలువురు వ్యాపారవేత్తలపై ఇటీవల జరిగిన ఐటి దాడులను తమ టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. దాడులు ఎవరిపై జరిగియో వారికే రివర్స్ టెెండరింగ్ ద్వారా జగన్ పోలవరం పనులను కట్టబెట్టారని, దన్నీ బట్టి చూస్తే ఎవరు ణిటో అర్థమవుతుందని ఆయన అన్నారు. 

click me!