Nara Chandrababu Naidu Bail:డిసెంబర్ 8 లోపుగా కౌంటర్ దాఖలుకు బాబుకు సుప్రీం ఆదేశం

By narsimha lodeFirst Published Nov 28, 2023, 2:57 PM IST
Highlights

చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై   ఆంధ్రప్రదేశ్ సీఐడీ   దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది. 
 

అమరావతి: చంద్రబాబు  బెయిల్ రద్దుపై  ఆంధ్రప్రదేశ్  క్రైమ్ ఇన్వెస్టిగేషన్  డిపార్ట్ మెంట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ ఏడాది డిసెంబర్  8వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన  బెయిల్ ను సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ సవాల్ చేసింది.  ఈ పిటిషన్ పై విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.  ఈ కేసుకు సంబంధించి మాట్లాడవద్దని కూడ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని  ఈ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన  ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో  చంద్రబాబుకు  ఈ ఏడాది  అక్టోబర్  31న ఏపీ హైకోర్టు  మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు  ఏపీ హైకోర్టు  మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో   ఈ నెల  21న  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

also read:AP Skill development case లో చంద్రబాబు బెయిల్‌‌పై సుప్రీంలో ఏపీ సీఐడీ పిటిషన్

అయితే  ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండానే  చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేశారని  సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.చంద్రబాబుకు మంజూరు చేసిన  బెయిల్ ను రద్దు చేయాలని ఆ పిటిషన్ లో సీఐడీ కోరింది.  ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించారు.

ఇవాళ్టికి చంద్రబాబుకు  మధ్యంతర బెయిల్ షరతులు వర్తిస్తాయి.  రేపటి నుండి  రెగ్యులర్ బెయిల్  అమల్లోకి రానుంది. దీంతో  సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ  పిటిషన్ దాఖలు చేసింది. అయితే  ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి  మాట్లాడవద్దని  సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరుపక్షాలు  కూడ ఈ విషయమై మాట్లాడవద్దని ఆదేశించింది.రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా కట్టడి చేయాలని  సీఐడీ చేసిన  వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరో వైపు ఈ విషయమై  ఈ నెల  8వ తేదీకి కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 

గతంలో చంద్రబాబు దాఖలు చేసిన  ఏపీ హైకోర్టు తీర్పును  సవాల్ చేస్తూ  సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్‌పీపై తీర్పు వచ్చిన తర్వాత  ఈ బెయిల్ పిటిషన్ ను తీర్పును వెల్లడించనున్నట్టుగా సుప్రీంకోర్టు వెల్లడించింది.

click me!