ఏపీ ఇంటర్ ఫలితాలు: బాలికలదే పై చేయి

By narsimha lodeFirst Published Apr 12, 2019, 11:10 AM IST
Highlights

ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఈ దఫా ఏపీ సర్కార్ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసింది.
 

అమరావతి: ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఈ దఫా ఏపీ సర్కార్ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసింది.

శుక్రవారం నాడు ఏపీ ఇంటర్ ఫలితాలను ఏపీ  ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి విడుదల చేశారు.ఏపీ రాష్ట్రంలో ఇంటర్, ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. ఈ దఫా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా ఉందని ఆమె ప్రకటించారు.

ఇంటర్ సెకండియర్‌లో 72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టుగా ఉదయలక్ష్మి తెలిపారు.  ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభించిన ఇంటర్ పరీక్షలను మార్చి 18వ తేదీన పూర్తి చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

ఈ ఏడాది 10.17 లక్షల మంది హల్‌టిక్కెట్లను తీసుకొన్నప్పటికీ కేవలం 9.65 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలను రాశారని ఉదయలక్ష్మి చెప్పారు.వీరిలో 6.03 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారన్నారు.

బాలికలు ఎక్కువ శాతం ఈ విద్యాసంవత్సరం ఉత్తీర్ణులైనట్టుగా ఆమె తెలిపారు. ఇంటర్ 72 ఉత్తీర్ణత శాతం వచ్చినట్టుగా తెలిపారుఇంటర్ సెకండియర్‌లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధిస్తే, విద్యార్థులు 68 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారని ఆమె వివరించారు.

ఇ:టర్ ద్వితీయ సంవత్సరంలో తొలిసారిగా గ్రేడింగ్ పద్దతిని ప్రవేశపెట్టారు.  ఈ విద్యా  సంవత్సరం నుండే ఈ గ్రేడింగ్ పద్దతిని అమలు చేస్తున్నారు. గ్రేడింగ్ లో 10 పాయింట్లకు పది పాయింట్ల సాధించిన విద్యార్థులు 9340 మంది ఉన్నారని చెప్పారు.
 

 

click me!