తాడేపల్లి గూడెంలో ఘర్షణ.. ఒకరు మృతి

Published : Apr 12, 2019, 10:27 AM IST
తాడేపల్లి గూడెంలో ఘర్షణ.. ఒకరు మృతి

సారాంశం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మసీదు సెంటర్లో అర్థరాత్రి కొందరు యువకుల మధ్య వివాదం తలెత్తింది. మొదట చిన్న వివాదంగా ప్రారంభమై.. తర్వాత అది పెద్ద ఘర్షణకు దారి తీసింది. 

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మసీదు సెంటర్లో అర్థరాత్రి కొందరు యువకుల మధ్య వివాదం తలెత్తింది. మొదట చిన్న వివాదంగా ప్రారంభమై.. తర్వాత అది పెద్ద ఘర్షణకు దారి తీసింది. మద్యం మత్తులో కొందరు యువకులు ఒకరిపై మరొకరు కత్తులతో దాడులు చేసుకున్నారు.

ఈ క్రమంలో జానీ అనే యువకుడు పై  మరో యువకుడు సంపత్ చాకుతో దాడికి తెగబడ్డాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ పిల్లి వెంకన్న(45) తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

తీవ్రగాయాల పాలైన జానీ పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సంపత్ తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది ముఖ్యమంత్రి ఎక్కడ: లక్ష్మీ పార్వతి | Lakshmi Parvathi Comments
సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna