నేను రిటైర్ కావడం లేదు: ఏపీ అసెంబ్లీ లాబీల్లో పేర్నినాని, గోరంట్ల మధ్య ఆసక్తికర చర్చ

By narsimha lodeFirst Published Feb 6, 2024, 12:35 PM IST
Highlights

నిత్యం ఉప్పు, నిప్పులా ఉండే వైఎస్ఆర్‌సీపీ, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు  మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అసెంబ్లీ లాబీల్లో సరదాగా  మాట్లాడుకున్నారు.  వచ్చే ఎన్నికల్లో  పోటీపై చర్చించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో  తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేల గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే  పేర్ని నాని మధ్య  మంగళవారం నాడు  ఆసక్తికర సంభాషణ జరిగింది. 

టీడీపీ సభ్యుల ఆందోళనతో అసెంబ్లీని  స్పీకర్ తమ్మినేని సీతారాం  టీ బ్రేక్ కోసం కొద్దిసేపు వాయిదా వేశారు. ఈ సమయంలో అసెంబ్లీ లాబీల్లో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి  పేర్ని నాని ఎదురు పడ్డారు.త్వరలోనే మీరు నేను రిటైర్ అవుతున్నామని పేర్ని నాని  గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి  వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై  గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. తాను రిటైర్ కావడం లేదన్న బుచ్చయ్య చౌదరి  స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్టు ఉండదంటున్నారని నాని ప్రస్తావించారు. అయితే 2024 లో  తాను కచ్చితంగా పోటీలో  ఉంటానని బుచ్చయ్య చౌదరి తేల్చి చెప్పారు.

also read:దెందులూరులో సిద్దం సభ: బస్సు నడుపుకుంటూ వెళ్లిన మాజీ మంత్రి పేర్ని నాని (వీడియో)

వచ్చే ఎన్నికల్లో  మచిలీపట్టణం నుండి  పేర్ని నాని పోటీ చేయడం లేదు. పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పోటీ చేయనున్నారు. అయితే  రాజమండ్రి  రూరల్ అసెంబ్లీ స్థానం నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 

also read:ఏపీ అసెంబ్లీలో నిరసన, గందరగోళం: టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగు దేశం, జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి. వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది.   వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని  175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా  వైఎస్ఆర్‌సీపీ వ్యూహాలు రచిస్తుంది. ఈ క్రమంలోనే  గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే  సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చుతుంది.
 

click me!