కలియుగ కురుక్షేత్రంలో జగన్ అభినవ అర్జునుడు...పవన్ ది శల్యుడి పాత్ర : పేర్ని నాని

By Arun Kumar P  |  First Published Feb 6, 2024, 11:50 AM IST

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ అధికాార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  తాజాగా సీఎం జగన్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లను మహాభాారతంలోని పాత్రలతో పోలుస్తూ పేర్ని నాని ఆసక్తికర కామెంట్స్ చేసారు. 


అమరావతి : కలియుగ భారతంలో కౌరవసేనతో పోరాడేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్జునుడి పాత్ర పోషిస్తున్నారని మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ , సోనియాగాందీ... అందరూ కౌరవ సైన్యంలా ఒక్కటై తమపై విరుచుకుపడాలని చూస్తున్నారని అన్నారు. కానీ అంతిమంగా ఎన్నికల కురుక్షేత్రంలో గెలిచేది తామేనని పేర్ని నాని అన్నారు. 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ లపై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ లాంటివాళ్లు కుటుంబబంధాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా వుందన్నారు. సొంత అన్న చిరంజీవి కేంద్ర మంత్రిగా వుండగానే కాంగ్రెస్ ఓడించాలని చెప్పిన వ్యక్తి పవన్ అన్నారు. అన్నని అవమానించి రాజకీయాలు చేసాడు... తల్లిని తిట్టిన వాడి పల్లకి మోస్తున్నాడు... అలాంటి పవన్ కు బంధాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు నాని. 

Latest Videos

వైఎస్ షర్మిల సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుకుని దూషించడం తగదన్నారు. రాజకీయ లబ్ది కోసమే శత్రువులు ఆమెను ఉసిగొల్పుతున్నారని... వాళ్లు చెప్పినట్లే ఈమె చేస్తోందన్నారు. ఏదో ఒకరోజు అన్న వైఎస్ జగన్ విలువేంటో షర్మిలకు తెలిసివస్తుందని అన్నారు. 

ఎన్నికల్లో పోటీ చేస్తాడట... కానీ ముఖ్యమంత్రిని అవ్వలేను అని జనసైనికులతో పవన్ అంటున్నాడని నాని గుర్తుచేసారు. యుద్దంలో ధైర్యాన్ని చంపేవాడిని శల్యుడు అంటారు... పవన్ కూడా శల్యుడేనని అన్నారు. ఇప్పటికే చంద్రబాబు పల్లకి మోస్తున్న పవన్ జనసైనికులను కూడా అందుకు సిద్దం చేస్తున్నాడని అన్నారు.  

Also Read  జనసేన కార్యాలయం ముందు కత్తులతో రెక్కీ ... టార్గెట్ ఆయనేనా?

ఇక వైసిపి వీడి జనసేనలో చేరగానే ఎంపీ వల్లభనేని బాలశౌరి సీఎం జగన్ గురించి అంతా తెలుసని అంటున్నాడు... అసలేం తెలుసు అంటూ నాని మండిపడ్డారు.  
తెనాలి నుండి గుంటూరుకి అక్కడినుండి బందరు పారిపోయిన వీళ్లా జగన్ గురించి మట్లాడేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ లో వుండగా నాదెండ్ల మనోహర్ ని ఇదే బాలశౌరి కాల్చుకుతిన్నాడు... ఇప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుంటేనే క్షమించి పార్టిలోకి రానిచ్చాడని అన్నారు. నాదెండ్లనే కాదు ఆయన భార్యని వేదించినవాడు ఈ బాలశౌరి అంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. తెనాలి, నరసరావుపేట, గుంటూరు లో ఎంక్వయిరి చేస్తే బాలశౌరి గురించి తెలుస్తుందన్నారు.

ఇక చంద్రబాబు తనను సర్వర్ అంటున్నాడు... పార్టీ కార్యకర్తలకు ప్రేమగా భోజనం వడ్డిస్తే సర్వర్లు అయిపోరన్నారు. చంద్రబాబు మతిబ్రమించి పెత్తందారి మనస్తత్వంతో మాట్లాడుతున్నాడని అన్నారు. సర్వర్లంటే అంత చిన్నచూపా? అదీ ఓ ఉద్యోగమేనని చంద్రబాబు గుర్తించాలని పేర్ని నాని సూచించారు. 

 
 

click me!