కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు, ఒకరు మృతి.. (వీడియో)

Published : Sep 18, 2021, 09:38 AM IST
కేఈబీ కెనాల్ లోకి  దూసుకెళ్లిన ఇన్నోవా కారు, ఒకరు మృతి.. (వీడియో)

సారాంశం

ఈ ప్రమాదంలో కైలా ప్రశాంత్ (28) అనే వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని, క్షతగాత్రులను అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ గాయాలైన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. 

కృష్ణాజిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలో ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. కొత్తపాలెం సమీపంలోని కేఈబీ కెనాల్ లోకి  ఇన్నోవా కారు దూసుకెళ్లింది.

 "                            
                                                   
ఈ ప్రమాదంలో కైలా ప్రశాంత్ (28) అనే వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని, క్షతగాత్రులను అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ గాయాలైన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు.               
                                                
కాగా, ప్రమాద సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులున్నారని తెలిసింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు ఇన్నోవా కాలువలోకి దూసుకెళ్లిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన మీద పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్