జెసికి ఊరట

Published : Jul 19, 2017, 04:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
జెసికి ఊరట

సారాంశం

తన వివాదంలో జోక్యం చేసుకోమని కోరినపుడు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూడా నిరాకరించారు. దాంతో జెసికి ఏం చేయాలో పాలుపోలేదు. సరే. తెరవెనుక జెసి ఏం ప్రయత్నాలు చేసుకున్నారో ఏమో మొత్తానికి జెసిపై ఇండిగో సంస్ధ విధించిన ట్రావెల్ బ్యాన్ను ఈరోజు ఎత్తేసింది.

మొత్తానికి అనంతపరం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డిపై ఉన్న ట్రావెల్ బ్యాన్ను ఇండిగో విమానసంస్ధ ఎత్తేసింది. ఆమధ్య విశాఖపట్నం విమానాశ్రయంలో బోర్టింగ్ పాస్ ఇవ్వలేదన్న కోపంతో ఇండిగో విమానసంస్ధ సిబ్బందిపై జెసి వీరంగం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత ఇండిగో సంస్ధతో పాటు మరి కొన్ని సంస్ధలు కూడా బ్యాన్ విధించాయి. దాంతో జెసి విమానంలో ప్రయాణం చేయలేక అల్లాడిపోయారు.

ట్రావెల్ బ్యాన్ ఎత్తేయాలని కోరుతూ జెసి కోర్టుకు వెళ్ళినా ఉపయోగం కనబడలేదు. చంద్రబాబునాయుడు కూడా ట్రావెల్ బ్యాన్ వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ సూచించినా జెసి లెక్క చేయలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు రూ. 7 లక్షలు ఖర్చు పెట్టుకుని ప్రైవేటు విమానంలో ఢిల్లీకి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.

తన వివాదంలో జోక్యం చేసుకోమని కోరినపుడు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూడా నిరాకరించారు. దాంతో జెసికి ఏం చేయాలో పాలుపోలేదు. సరే. తెరవెనుక జెసి ఏం ప్రయత్నాలు చేసుకున్నారో ఏమో మొత్తానికి జెసిపై ఇండిగో సంస్ధ విధించిన ట్రావెల్ బ్యాన్ను ఈరోజు ఎత్తేసింది. బ్యాన్ విధించిన మిగిలిన సంస్ధలు ఏం చేస్తాయో చూడాలి

PREV
click me!

Recommended Stories

YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu
Vidadala Rajini Serious: పోలీసులే ఈ హత్యలు చేయిస్తున్నారు | Salman Murder Case | Asianet News Telugu