‘గంటా’ ఆస్తుల స్వాధీనం

Published : Dec 29, 2016, 05:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
‘గంటా’ ఆస్తుల స్వాధీనం

సారాంశం

ఇండియన్ బ్యాంకుకు బకాయిపడ్డ ప్రత్యూష కంపెనీ రూ. 200 కోట్లు ఎగ్గొట్టినట్లు సమాచారం రుణానికి హామీదారుగా ఉన్న మంత్రి గంటా మంత్రి ఇల్లు, ఆఫీసు, ఇతర ఆస్తులు స్వాధీనం

 

తెలుగు తమ్ముళ్లు బ్యాంకులకు ఎగనామం పెట్టడం రివాజుగా మారినట్లు ఉంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి దారిలోనే మంత్రి గంటా శ్రీనివాసరావు తన శక్తి మేర ఓ బ్యాంకు రుణాన్ని ఎగ్గొట్టారు.

 

మెస్సర్స్ ప్ర‌త్యూష రీసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా  ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి  మరికొందరితో కలసి గంటా హామీదారుగా ఉన్నారు.

 

ఈ కంపెనీ విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ బ్యాంకు నుంచి  రూ. 200 కోట్లు రుణంగా తీసుంది. అయితే రుణం ఎంతకీ చెల్లించకపోవడంతో బ్యాంకు యాజమాన్యం అక్టోబర్ 4 న కంపెనీ యజమానులకు, హామీదారులకు నోటీసులు పంపడంతో పాటు పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది.

 

అయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో రంగంలోకి దిగిన బ్యాంకు వారి ఆస్తుల స్వాధీనానికి పూనుకుంది.

 

గంటాకు చెందిన ఇల్లు, పార్టీ కార్యాలయంతో సహా ఇతర ఆస్తులను జప్తు చేసింది.

 

అలాగే, మంత్రి అనుచరుడు పరుచూరి భాస్కర్ రావు ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?