భారత్ పరువు తీసిన డోపి

Published : Jul 08, 2017, 08:47 AM ISTUpdated : Mar 24, 2018, 12:11 PM IST
భారత్ పరువు తీసిన డోపి

సారాంశం

క్రీడల ప్రారంభం సదర్భంగా పోయిన నెలలోనే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) జగ్తార్ మూత్రం శాంపిల్స్ సేకరించి పరీక్షించింది. పరీక్షల్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దాంతో అథ్లెట్ పై వేటు ఖాయమైంది.

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు రెండో రోజు భారత్ పరువు పోయింది. దెకథ్లాన్ అథ్లెట్ జగ్తార్ సింగ్ డోపింగ్ లో పట్టుబడి దేశం పరువు తీసాడు. ఛాంపియన్ షిప్ నిర్వహణను ఎంతో గొప్పగా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ కు జగ్తార్ సింగ్ అంశం తలవొంపులు తెచ్చింది. మెల్డోనియం అనే నిషేధిత ఉత్ప్రేరకాన్ని జగ్తార్ తీసుకున్నట్లు పరీక్షల్లో నిరూపితమైన కారణంగా సదరు క్రీడాకారుడిపై వేటు  పడింది.

క్రీడల ప్రారంభం సదర్భంగా పోయిన నెలలోనే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) జగ్తార్ మూత్రం శాంపిల్స్ సేకరించి పరీక్షించింది. పరీక్షల్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దాంతో అథ్లెట్ పై వేటు ఖాయమైంది. అయితే, మళ్ళీ ఇంకో రౌండ్ పరీక్షలు జరుగనున్నాయి. ఇందులో కూడా మొదటి పరీక్ష ఫలితమే నిర్ధారణైతే నాలుగేళ్ళ పాటు జగ్తార్ పై నిషేధం వేటు పడే అవకాశాలున్నాయి.

95 మంది సభ్యుల అథ్లెట్ల బృందంలో జగ్తార్ కూడా సభ్యుడే. డెకథ్లాన్ లో జగ్తార్ తో పాటు అభిషేక శెట్టితో పాటు పాల్గొనాల్సి ఉంది. అయితే, రాబోయే ముప్పును ముందే పసిగట్టిన జగ్తార్ తనంతట తానుగా క్రీడల ప్రారంభానికి గైర్హజరవ్వటంతో శెట్టి ఒక్కరే పాల్గొన్నారు. జగ్తార్ పరీక్ష ఫలితాన్ని నాలుగు రోజుల క్రితమే ‘నాడా’ అధికారులు భారత క్రీడల సమాఖ్యకు తెలియజేసారు.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని జ‌గ‌న్ ఎందుకు కోరుకుంటున్నారు.? ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్
Cyclone Arnab : అర్నబ్ తుపాను లోడింగ్..? రాబోయే మూడ్రోజులు వర్ష బీభత్సమే, ఇక్కడ అల్లకల్లోలం తప్పదు