4 స్వర్ణాలతో భారత్ జోరు

First Published Jul 8, 2017, 7:32 AM IST
Highlights

రెండోరోజు భారత్ క్రీడాకారులు నాలుగు స్వర్ణపతకాలను చేజిక్కించుకున్నారు.

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్స్ షిప్ రెండో రోజు కూడా భారత్ జోరు కొనసాగుతోంది. రెండోరోజు భారత్ క్రీడాకారులు నాలుగు స్వర్ణపతకాలను చేజిక్కించుకున్నారు. పురుషుల, మహిళల 400 మీటర్ల విభాగాల్లో వరుసగా మొహ్మద్ అనస్ (45.77 సెకన్లు), నిర్మల షెరోన్ (52.01)సెకన్లు), పురుషుల, మహిళల 1500 మీటర్ల విభాగాల్లో వరుసగా అజయ్ కుమార్ సరోజ్ (3ని.45.85 సెకన్లు), పియూచిత్రా (4ని.17.92 సెకన్లు)విజేతలుగా నిలిచి బంగారు పతకాలు సాధించారు.

మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతిచంద్ (11.52 సెకన్లు) కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, పురుషుల షాట్ ఫుట్ లో తేజీందర్ పాల్ సింగ్ (19.77 మీటర్లు) రజతం, పురుషుల 400 మీటర్లలో అరోకియా రాజీవ్ (46.61 సెకన్లు) కాంస్యం చేజిక్కించుకున్నారు. అంతకుముందు 4x100 మీటర్ల రిలే ప్రిలిమనరీ రేసులో భారత్ బృందం నిర్ణీత వ్యవధిలో ఫైనల్ బ్యాట్ ను అందించటంలో విఫలమైంది. దాంతో తదుపరి రౌండ్ కు అర్హత సాధించలేకపోయింది. మరోవైపు డెకాథ్లాన్ ఈవెంట్లో పోటీ పడాల్సిన భారత్ అథ్లెట్ జగ్తార్ సింగ్ డోపింగ్ లో పట్టుబడటంతో బరిలోకి దిగలేకపోయాడు.

అధికారి తప్పిదం:  తొలిరోజు పూర్తయిన 400 మీటర్ల సెమీఫైనల్ రేసును ఓ అధికారి తప్పిదం కారణంగా శుక్రవారం మళ్ళీ నిర్వహించాల్సి వచ్చింది. గురువారం జరిగిన రేసు ప్రారంభ సమయానికి ముందే అధికారి అనుకోకుండా తుపాకి ట్రిగ్గర్ ను నొక్కారు. దాంతో రేసు ప్రారంభమైందనుకున్న అథ్లెట్లు పరుగు అందుకున్నారు. ఇందులో భారత్ అథ్లెట్ మహ్మమద్ అనాస్ అగ్రస్ధానంలో నిలిచారు. అయితే, రేసు పూర్తయ్యాక కొంతమంది అథ్లెట్లు రిఫరీకి ఫిర్యాదు చేయటంతో శుక్రవారం మళ్ళీ రేసు నిర్వహించారు. అయితే, నిజంగా జరిగిన రేసులో అనాస్ ఫైనల్ కు చేరుకోవటమే కాకుండా ఫైనల్లో స్వర్ణం సాధించాడు.

click me!