గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి..!

Published : Jan 26, 2021, 11:28 AM IST
గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి..!

సారాంశం

ఈ వేడుకల సమయంలో రెండు చోట్ల అపశ్రుతి చోటుచేసుకుంది. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. 

దేశ వ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల సమయంలో రెండు చోట్ల అపశ్రుతి చోటుచేసుకుంది. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. గుంటూరు పోలీస్ క్రీడా మైదానంలో జరిగిన వేడుకల్లో తెనాలికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి సీతారామయ్య అస్వస్దతకు గురై.. స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు.

అలాగే అనంతపురంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తుండగా ఇద్దరు మహిళా ఎన్‌సీసీ క్యాడేట్లు, ఏఆర్ కానిస్టేబుల్ అస్వస్థతకు గురై ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయారు. వెంటనే అధికారులు వారికి సపర్యలు చేసి పక్కకు తీసుకెళ్లారు. వారికి ఎలాంటి అల్పాహారం ఇవ్వకుండా పేరెడ్‌కు తీసుకు రావడమే కారణంగా తెలియవచ్చింది.
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu