గుంటూరు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్ బదిలీ?

By AN Telugu  |  First Published Jan 26, 2021, 11:11 AM IST

గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ బదిలీకి సంబంధించి ఏ క్షణాన అయినా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. పంచాయతీ ఎన్నికలను ఆపాలని ప్రభుత్వం వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టి వేయడం.. తీర్పుపై సమాలోచనల అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించాలని నిర్ణయించింది. 

షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం చేసిన ప్రకటనలతో పరిస్థితి మారిపోయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 29న నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ఆ లోపే కలెక్టర్‌ని బదిలీ చేసి వేరొకరిని నియమించే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు భావిస్తోన్నాయి. 

Latest Videos

undefined

ఈ నెల 22నే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్‌ తొలగింపునకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. నూతన కలెక్టర్‌ నియామకం కోసం ముగ్గురు ఐఏఎస్‌ల పేర్లను సిఫార్సు చేయాలని సీఎస్‌ని ఆదేశించారు.

అలానే జేసీకి చార్జి ఇచ్చి రిలీవ్‌ కావాలని తెలిపారు. అయితే ఎస్‌ఈసీ ఆదేశాలపై ఆ రోజున ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. కలెక్టర్‌ కరోనా విధుల్లో ఉన్నారని చెప్పి బదిలీ చేయకుండా నిలుపుదల చేసింది. 

23న ఎస్‌ఈసీ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌కి కలెక్టర్‌, జేసీ గైర్హాజరయ్యారు. సోమవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎస్‌ఈసీకి సహకరించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. కలెక్టర్‌ బదిలీకి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉంది.

click me!