మూఢ భక్తితో మదనపల్లిలో కూతుళ్ల హత్య: తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు

Published : Jan 26, 2021, 10:59 AM ISTUpdated : Jan 26, 2021, 11:06 AM IST
మూఢ భక్తితో మదనపల్లిలో కూతుళ్ల హత్య: తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు

సారాంశం

జిల్లాలోని మదనపల్లెలో ఇద్దరు కూతుళ్లను చంపిన కేసులో తల్లిదండ్రులను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

చిత్తూరు: జిల్లాలోని మదనపల్లెలో ఇద్దరు కూతుళ్లను చంపిన కేసులో తల్లిదండ్రులను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

పెద్ద కూతురు అలేఖ్యను పూజ గదిలో తండ్రి పురుషోత్తంనాయుడు చంపేశాడు. ఏ1గా తండ్రి పురుషోత్తం, ఏ2 తల్లి పద్మజగా పోలీసులు చేర్చారు.చిన్న కూతురును డంబెల్ తో తల్లి కొట్టి చంపింది. తన చెల్లెలిని  తీసుకొని రావడానికి తనను కూడ చంపాలని పెద్ద కూతురు కోరింది.దీంతో పూజ గదిలో పెద్ద కూతురును తండ్రి కొట్టి చంపాడు. కూతుళ్లను కొట్టి చంపిన తర్వాత తామిద్దరూ కూడ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. 

ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తన తోటి ఉద్యోగికి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకొన్నారు. ఆత్మహత్య చేసుకోవాలని భావించిన పురుషోత్తంనాయుడు దంపతులను అడ్డుకొన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులు అక్కడికి చేరుకొని కూతుళ్లను చంపిన దంపతులను విచారించారు.  నిన్న సాయంత్రం  కూతుళ్ల అంత్యక్రియలు నిర్వహించారు. ఇవాళ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులు పిల్లలను హత్య చేసేందుకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్