పెళ్ళి ఒకరితో... సహజీవనం మరొకరితో...ఇంకొకరితో అక్రమ సంబంధం... మహిళ నిర్వాకానికి ఇద్దరు బలి

By Arun Kumar PFirst Published Jan 23, 2022, 9:09 AM IST
Highlights

ఓ వివాహిత భర్తను విడిచి ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ మరో వ్యక్తితో అక్రమసంబంధాన్ని  కొనసాగించింది. ఈ వ్యవహారం ఎలాంటి సంబంధం లేని ఇద్దరి బలితీసుకోగా మరొకరిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. 

నెల్లూరు: వివాహేతర (extramarital affair), అక్రమ సంబంధాలు (illegal affair) కొంతకాలం శారీరక ఆనందాన్ని ఇచ్చినా చివరకు విషాదాంతమే అవుతాయన్నది కాదనలేని నిజం. ఈ చాటుమాటు రాసలీలలు కుటుంబాలను చిన్నాభిన్నం చేయడమే కాదు ప్రాణాలనే బలితీసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో విచ్చలవిడితనం పెరిగి ఈ అక్రమ బంధాలు ఎక్కువవడంతో పాటు వీటి కారణంగా జరుగుతున్న నేరాలు కూడా పెరిగిపోయాయి. ఇలా వివాహం కాకుండానే ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్న ఇద్దరి మధ్య గొడవకు ఈ వ్యవహారంతో సంబంధమే లేని తల్లీకొడుకు బలయ్యారు. 

వివరాల్లోకి వెళితే...  పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (nellore district) అంబటిరాయునిపాలెం గ్రామానికి చెందిన నూర్జహాన్ కు పెళ్లయి భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలోనే వివాహితుడైన సమీప బంధువు షేక్ రబ్బానీతో ఆమెకు చనువు పెరిగి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరిమధ్య బంధం మరింత పెరిగి సహజీవనం చేయసాగారు. ఇలా దాదాపు ఎనిమిదేళ్ల పాటు వీరి సహజీవనం సాఫీగా సాగింది. ఈ క్రమంలోనే వీరు సంతానాన్ని పొందారు. 

అయితే కాపురం పెట్టిన ఒంగోలులోనే రబ్బాని ఓ టీస్టాల్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తనకు సహాయంగా వుంటాడని సత్యనారాయణపురంకు చెందిన మండ్ల కాశీకుమార్ ను టీస్టాల్ లో పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తరచూ రబ్బానీ ఇంటికి వెళ్లడంతో నూర్జహాన్ తో కాశీకుమార్ కు చనువు పెరిగింది. ఇద్దరు మధ్యా చనువు మరింత పెరిగి అక్రమ సంబంధంగా మారింది. దీంతో సహజీవనం చేస్తున్న రబ్బానీని విడిచి కాశీతో లేచిపోయింది నూర్జహాన్. 

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన రబ్బానీ నూర్జహాన్ వదిన మీరాంబీ దీనంతనటికి కారణమని భావించాడు. తనకు నూర్జహాన్ ను దూరం చేయాలనే మీరాంబీ ఇదంతా చేయించిందని అనుమానించాడు. దీంతో ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు రబ్బానీ. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడిచేసాడు. ఈ దాడిలో మీరాంబీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

తల్లి మీరాంబీపై జరుగుతున్న దాడిని అడ్డుకోడానికి అలీఫ్(23) ప్రయత్నించాడు. దీంతో రబ్బానీ అతడిని కూడా కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో అలీఫ్ కూడా ఘటనా స్థలంలోనే మరణించాడు. ఇంతటితో ఆగకుండా తన ప్రియురాలిని లేపుకుపోయిన కాశీకుమార్ ను కూడా హతమార్చడానికి రబ్బానీ ప్రయత్నించి చివరకు పోలీసులకు చిక్కాడు. 

ఒంగోలులోని గుంటూరు రోడ్డులో కాశీకుమార్ వున్నట్లు రబ్బానీ తెలుసుకున్నాడు. దీంతో అక్కడికి వెళ్లగా కాశీ ఒంటరిగా కనిపించాడు. దీంతో అతడిపై నడిరోడ్డుపైనే కత్తితో దాడి చేసాడు.  అయితే అక్కడే ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ ఇది గమనించి రబ్బానీని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు.  దీంతో రబ్బానీని విచారించగా అప్పటికే చేసిన రెండు హత్యల గురించి బయటపెట్టాడు.

ఇద్దరిని అతి దారుణంగా హత్యచేసి మరో హత్యకు యత్నించిన రబ్బానీపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు పోలీసులు. అతడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం కాశీకుమార్ ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రితో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఇతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపార

 

click me!