మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా.. ఐసొలేషన్‌లోకి మంత్రి

By Mahesh KFirst Published Jan 22, 2022, 6:31 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా సోకింది. ఈ రోజు ఆయనే ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంటిలోనే ఐసొలేషన్‌లో ఉన్నట్టు వివరించారు. తనతో టచ్‌లోకి వచ్చిన వారు వెంటనే కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. మాస్క్‌లు ధరించాలని హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా రిపోర్ట్ అవుతున్నాయి.
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో కరోనా కేసులు(Corona Cases) భారీగా పెరుగుతున్నాయి. ఈ కేసుల్లో రాజకీయ ప్రముఖులూ ఉన్నారు. ఇప్పటికే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Minister Mekapati Gautham Reddy) కరోనా బారిన పడ్డారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా టెస్టు చేసుకున్నారు. ఈ టెస్టులో తనకు కరోనా పాజిటివ్ అని ఫలితం వచ్చింది. ప్రస్తుతం తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఆయన వివరించారు. అందుకే తన ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉన్నట్టు వివరించారు. అంతేకాదు, గత కొన్ని రోజులుగా తనతో టచ్‌లో ఉన్నవారు వెంటనే కరోనా టెస్టు చేయించుకోవాలని కోరారు. జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.

ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కరోనా(Coronavirus) బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్(Positive) అని తేలిందని వివరించారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని ఆయన తెలిపారు. వెంటనే తాను హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు పేర్కొన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, తనతో కాంటాక్టులోకి వచ్చిన వారూ వెంటనే కరోనా టెస్టు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చంద్రబాబు నాయుడు కంటే ఒక రోజు ముందు ఆయన కుమారుడు లోకేష్‌కు కరోనా సోకింది.

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 43,763 శాంపిల్స్ పరీక్షించగా 12,926 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి ఏపీ వైద్యారోగ్య అధికారులు సూచిస్తోన్నారు. 

గ‌త‌వారంలో ఐదు వేలు, ఆరు వేలు న‌మోదు అయినా కేసులు సంక్రాంతి   తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా ఈరోజు 43,763 శాంపిల్స్‌ను పరీక్షించగా 12,926 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఇందులో అత్య‌ధికంగా.. విశాఖ జిల్లాలో 1,959 కేసులు న‌మోదు కాగా..  చిత్తూరు జిల్లాలో 1,566 కేసులు, అనంతపురం జిల్లాలో 1,379 కేసులు, గుంటూరు జిల్లాలో 1,212 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,001 కేసులు న‌మోద‌న‌ట్టు ఆర్యోగ నిపుణులు వెల్లడించారు. ఇతర జిల్లాల్లోనూ అదే స్థాయిలో కొత్త కేసులు గుర్తించారు. ఇదే స‌మ‌యంలో కరోనాతో ఈ రోజు ఆరుగురు మృతి చెందారు. కరోనా కారణంగా  విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒకరు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14538కు చేరింది.

click me!