ఏసీబీ క్లియరెన్స్ తర్వాతే ఉన్నతోద్యోగుల నియామకం: జగన్ సర్కార్‌కి ఐఐఎం నివేదిక

Published : Aug 25, 2020, 02:24 PM IST
ఏసీబీ క్లియరెన్స్ తర్వాతే ఉన్నతోద్యోగుల నియామకం: జగన్ సర్కార్‌కి ఐఐఎం నివేదిక

సారాంశం

  రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అహ్మదాబాద్ ఐఐఎం సిఫారసు చేసింది. 


అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అహ్మదాబాద్ ఐఐఎం సిఫారసు చేసింది. అవినీతీకి దూరంగా ఉండాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఐఐఎం కీలక సిఫారసలు చేసింది. ఉన్నతాధికారుల నియామకం విషయంలో కూడ పలు కీలక రికమండేషన్స్ చేసింది ఐఐఎం.

also read:లంచం తీసుకొంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే ఏడాదిలోపుగా చర్యలు: జగన్ ఆదేశం

గతంలో ఐఐఎం అహ్మదాబాద్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది.పారదర్శక పాలన కోసం ఏం చేయాలనే దానిపై జగన్  ఐఐఎంను నివేదిక కోరారు. ఐఐఎం ప్రతినిధులు ఈ నెల 24వ తేదీన నివేదికను ఇచ్చారు. 

రెవిన్యూ శాఖలో అవినీతి నిర్మూలనకు కీలక ప్రతిపాదనలను ఐఐఎం చేసింది. పాలనా వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యాన్ని నివారించాలని ఐఐఎం సూచించింది. మాఫియా, రాజకీయ నేతల జోక్యం పరిపాలనా వ్యవహరాల్లో ఉండకూడదని కోరింది.

also read:రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్: జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా అవినీతికి దూరంగా ఉంచేలా చేయవచ్చని ఐఐఎం సూచించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి ద్వారా సగటున 158 సేవలు ప్రజలకు అందుతున్నట్టుగా ఐఐఎం ఈ నివేదికలో పొందుపర్చింది. ప్రతి ఉద్యోగి నెలకు కనీసం 100 ఫైల్స్ చూస్తున్నట్టుగా నివేదిక తెలిపింది. 

ప్రభుత్వ శాఖలో ఉన్నత అధికారుల నియామకం చేసే సమయంలో ఏసీబీ అధికారుల క్లియరెన్స్ చేసిన తర్వాతే నియామకాలు చేపట్టాలని కూడ సూచించింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్