(వీడియో) టిడిపి గెలవకపోతే అభృద్ధి జరగదు

Published : Jul 14, 2017, 01:59 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
(వీడియో) టిడిపి గెలవకపోతే అభృద్ధి జరగదు

సారాంశం

టిడిపికి ఓట్లేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రతిపక్షం తరపున గెలిచిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ప్రభుత్వం అభివృద్ధి చేయదని నిర్లజ్జగా చెప్పుకుంటున్నారు. ఈయన కూడా ఫిరాయింపు ఎంఎల్ఏనే లేండి. ఫిరాయించిన తర్వాత మంత్రవ్వగానే చంద్రబాబుకు వీరవిధేయునిగా మారిపోయారు.

నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబునాయుడుతో పాటు మంత్రుల బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. అధికార పార్టీకి ఓట్లేస్తేనే అభివృద్ధి సాధ్యమనే బెదిరంపుతో కూడిన విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తున్నారు. నంద్యాలలో ప్రచారానికి వచ్చిన భారీ పరిశ్రమలశాఖ మంత్రి అమరనాధ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టిడిపికి ఓట్లేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.

ప్రతిపక్షం తరపున గెలిచిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ప్రభుత్వం అభివృద్ధి చేయదని నిర్లజ్జగా చెప్పుకుంటున్నారు. ఈయన కూడా ఫిరాయింపు ఎంఎల్ఏనే లేండి. ఫిరాయించిన తర్వాత మంత్రవ్వగానే చంద్రబాబుకు వీరవిధేయునిగా మారిపోయారు.

 అదే విధంగా, అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే నంద్యాలలో అసలు  పోటీనే పెట్టకూడదంటూ చెప్పటం విచిత్రంగా ఉంది. నాగిరెడ్డి పిల్లల మీద జగన్ కు జాలి, దయ కూడా  లేదనే సెంటిమెంటును ప్రయోగిస్తున్నారు.

భూమానాగిరెడ్డి ఉన్నప్పుడే నంద్యాల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారట. అసలు నాగిరెడ్డి పార్టీ మారిందే అభివృద్ధి కోసమట.  నంద్యాల అభివృద్ధి పై చిత్తశుద్ధి ఉంటే వైస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఉప ఎన్నికల పోటీ నుండి తప్పు కోవాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతోనే పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నిజంగా జగన్ కు ప్రజల మీద అభిమానం, ఆప్యాయత ఉంటే నంద్యాల్లో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోకూడదన్నారు. ఒక వేళ ఉపఎన్నికల్లో గెలిస్తే సంవత్సరం కాలంలో ఏమి అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటారో చెప్పండని జగన్ను ఫిరాయింపు మంత్రి ఎద్దేవా చేయటం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్