నేడు కృష్ణపట్టణానికి ఐసీఎంఆర్ బృందం: మందు తయారీ విధానాన్ని యూట్యూబ్‌లో పోస్టు చేసే యోచన

By narsimha lodeFirst Published May 23, 2021, 9:59 AM IST
Highlights

నెల్లూరు జిల్లా కృష్ణపట్టణానికి ఐసీఎంఆర్ వైద్యలు బృందం ఇవాళ సాయంత్రానికి రానుంది. రేపు ఐసీఎంఆర్ వైద్యుల బృందం సమక్షంలో  ఆనందయ్య మందును తయారు చేయనున్నారు. 

నెల్లూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్టణానికి ఐసీఎంఆర్ వైద్యలు బృందం ఇవాళ సాయంత్రానికి రానుంది. రేపు ఐసీఎంఆర్ వైద్యుల బృందం సమక్షంలో  ఆనందయ్య మందును తయారు చేయనున్నారు. ఆనందయ్య తయారు చేసిన మందుతో ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లదని ఆయుష్ కమిషనర్  రాములు ప్రకటించారు. అయితే దీని వల్ల  కరోనా నయం అయ్యే అవకాశం ఉందా అనే విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. 

also read:నాటు వైద్యమే, ఆయుర్వేదం కాదు: ఆనందయ్య మందుపై రాములు

ఈ విషయమై నిపుణుల సమక్షంలో  ఆనందయ్య తయారు చేసిన మందుతో ఎలాంటి ప్రమాదం లేదని తేల్చాల్సి ఉంది. అప్పటివరకుమందు పంపిణీ నిలిచిపోనుంది.  ఇప్పటికే కృష్ణపట్నంలో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. మరో వైపు ఆనందయ్య మందును ఎలా తయారు చేస్తారనే విషయాన్ని సోషల్ మీడియాలో  వీడియో రూపంలో పోస్ట్ చేయడం ద్వారా  కృష్ణ పట్టణానికి మందు కోసం వచ్చేవారి సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని  అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ విషయమై ఉన్నతాధికారుల అనుమతి తీసుకోనున్నారు. ఉన్నతాధికారులు అనుమతిస్తే మందు తయారీని యూట్యూబ్‌లో పోస్టు చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే  ఆనందయ్య  మందును కళ్లలో వేస్తారు. కళ్లలో మందు వేయడం పట్ల  నేత్ర వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కళ్లలో ఈ మందు వేయడం వల్ల కళ్లకు హాని కలిగే అవకాశం ఉంటుందనే అనుమానాలను నేత్ర వైద్యులు  చెబుతున్నారు. ఈ విషయమై  కూడ స్పష్టత రావాల్సి ఉంది. 
 

click me!