ప్రకాశం జిల్లాలో ఘోరం... రోడ్డు ప్రమాదంలో తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి

Arun Kumar P   | Asianet News
Published : May 23, 2021, 07:52 AM IST
ప్రకాశం జిల్లాలో ఘోరం... రోడ్డు ప్రమాదంలో తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి

సారాంశం

ప్రకాశం జిల్లాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు వదిలారు. 

ప్రకాశం: ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామునే రోడ్డు ప్రమాదానికి గురయి తల్లితో పాటు ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఈ ముగ్గురూ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు వదిలారు. 

ప్రకాశం జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ ఆటోలో రామకోటేశ్వరమ్మఅనే మహిళ కొడుకు వినోద్, కూతురు ప్రసన్నతో కలిసి ప్రయాణిస్తోంది. వినోద్ ఆటో నడిపిస్తుండగా తల్లీకూతురు వెనకాల కూర్చున్నారు. అయితే తెల్లవారుజామున ప్రయాణం కావడంతో వినోద్ నిద్రమత్తు ప్రమాదానికి దారితీసింది. 

read more  భార్య బాత్రూం వీడియో వైరల్... మనస్తాపంతో భర్త ఆత్మహత్య

ఉలవపాడు జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి ముందుగా వెళుతున్న లారీని ఢీకొట్టింది. అతివేగంగా వెళుతూ లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఆటో తుక్కుతుక్కయ్యింది. 

ఈ ప్రమాదంపై సమాచారంఅందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి డ్రైవర్ వినోద్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?