ఉప ఎన్నికకు నేను రెడీ: వల్లభనేని వంశీ

Published : Aug 02, 2020, 03:39 PM ISTUpdated : Aug 02, 2020, 04:24 PM IST
ఉప ఎన్నికకు నేను రెడీ: వల్లభనేని వంశీ

సారాంశం

ఉప ఎన్నికకు తాను సిద్దమేనని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.ఆదివారం నాడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు.స్వయంగా ఈ విషయాన్ని సీఎం జగన్ కే చెప్పానని ఆయన గుర్తు చేశారు.   


గన్నవరం: ఉప ఎన్నికకు తాను సిద్దమేనని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.ఆదివారం నాడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు.స్వయంగా ఈ విషయాన్ని సీఎం జగన్ కే చెప్పానని ఆయన గుర్తు చేశారు. 

కరోనా ఎఫెక్ట్‌తో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని తాను ఆగినట్టుగా ఆయన చెప్పారు. రాజధాని తరలింపుపై తన ప్రాంతానికి చెందిన రైతులు కూడ నష్టపోయారన్నారు. 
ఉప ఎన్నికల ఫలితాన్ని రాజధాని మార్పుపై ప్రజాభిప్రాయంగా చూసినా తనకు సమ్మతమేనని ఆయన తెలిపారు.ఈ విషయమై తన అభిప్రాయం ఏమిటో చంద్రబాబు చెప్పాలని ఆయన కోరారు. తాను రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనతో ఉన్నట్టుగా సీీఎం జగన్  చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు 

ఎన్నికలు జరుగుతాయంటే ఇప్పుడే రాజీనామాకు సిద్దమని ఆయన స్పష్టం చేశారు. అమరావతిపై ప్రభుత్వం రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులని ఆయన చెప్పారు. 

also read:పంతం నెగ్గించుకొన్న జగన్: మూడు రాజధానులపై బాబు ఏం చేస్తారు

2019 ఎన్నికల్లో గన్నవరం నుండి జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున వల్లభనేని వంశీ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు.

అసెంబ్లీలో తనకు ప్రత్యేక స్థానం కేటాయించాలని వంశీ స్పీకర్ ను కోరారు. వంశీ కోరిక మేరకు అసెంబ్లీలో స్పీకర్ ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. చంద్రబాబుపై, లోకేష్ పై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu