విశాఖ షిప్ యార్డు మృతులకు రూ.50 లక్షలు: మంత్రి అవంతి శ్రీనివాస్

By narsimha lodeFirst Published Aug 2, 2020, 2:44 PM IST
Highlights

విశాఖపట్టణం హిందుస్థాన్ షిప్ యార్డులో మరణించినవారికి ఒక్కొక్కరికి రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియాచెల్లిస్తామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

విశాఖపట్టణం: విశాఖపట్టణం హిందుస్థాన్ షిప్ యార్డులో మరణించినవారికి ఒక్కొక్కరికి రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియాచెల్లిస్తామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

ఆదివారం నాడు హిందుస్థాన్ షిప్ యార్డు యాజమాన్యం, కాంట్రాక్టు సంస్థలతో మంత్రి అవంతి శ్రీనివాస్ చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఆయన చెప్పారు.  ప్రమాదం జరిగిన తీరును మంత్రి అడిగి తెలుసుకొన్నారు.విశాఖ షిప్ యార్డు చరిత్రలో ఇదే పెద్ద ప్రమాదమని ఆయన చెప్పారు.షిప్ యార్డులో జరిగిన ప్రమాదంపై దురదృష్టకరమన్నారు. విశాఖపై కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు

also read:విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డు ప్రమాదం: అనుపమ్ క్రేన్ సంస్థపై కేసు

కంపెనీ ఆర్ధిక పరిస్థితులు సరిగా లేకున్నా కూడ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా షిప్ యార్డు సీఎండీ తెలిపారు. మంత్రి అవంతి శ్రీనివాస్ సమక్షంలో కార్మిక సంఘాల ప్రతినిధుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకొన్నామన్నారు. 

విశాఖపట్టణం షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో 11 మంది మరణించారు. ఇవాళ మధ్యాహ్నానికి మృతదేహాలకు డెడ్ బాడీలకు కరోనా పరీక్షలు పూర్తి చేశారు. పోస్టుమార్టం పూర్తి చేసి బాధిత కుటుంబాలకు అందించనున్నారు.

 

click me!