రెండో పెళ్లి... నాన్న ఎక్కడని అడిగిందని: కన్నబిడ్డకు వాతలు పెట్టిన తల్లి

Siva Kodati |  
Published : Aug 02, 2020, 02:48 PM IST
రెండో పెళ్లి... నాన్న ఎక్కడని అడిగిందని: కన్నబిడ్డకు వాతలు పెట్టిన తల్లి

సారాంశం

కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి తనను ప్రశ్నించిందనే కోపంతో కాళ్లూ, చేతులపై అట్లకాడతో వాతలు పెట్టిందో తల్లి

కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి తనను ప్రశ్నించిందనే కోపంతో కాళ్లూ, చేతులపై అట్లకాడతో వాతలు పెట్టిందో తల్లి. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కదిరికి సమీపంలోని కందికుంట పరిధిలో ఉండే ఓ మహిళ భర్తతో విడిపోయింది.

భర్తతో విడిపోయే నాటికి ఆ మహిళకు మూడేళ్ల కూతురు వుండగా మళ్లీ ఐదు నెలల గర్బిణీ. ఆ తర్వాత కొంతకాలానికి రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట ఆ బాలిక మా నాన్నెవరు..? నాకు చెల్లెలో తమ్ముడో ఉండేవారట, ఎక్కడ అని తల్లిని అడిగినట్లు సమాచారం.

అందుకు అగ్రహించిన తల్లి వయసుకు మించి మాట్లాడుతున్నావు.. పెద్దల విషయాలు నీకెందుకంటూ విచక్షణ కోల్పోయింది. వెంటనే పసిబిడ్డ అని కూడా చూడకుండా ఒంటిపై అట్లకాడతో వాతలు పెట్టింది.

ఈ విషయం శనివారం ప్రజాసేవా సమాజ్, చైల్డ్‌లైన్ ప్రతినిధులకు తెలిసింది. వారు ఈ సమాచారాన్ని వెంటనే ఐసీడీఎస్ సిబ్బంది, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు, అధికారులు గాయపడిన బాలికకు చికిత్స అందించారు. తల్లిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి రెండో కాన్పులో పుట్టిన శిశువు గురించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి