నేను జగన్ సైనికుడిని, బాధ లేదు: కేబినెట్ పునర్వవ్యవస్థీకరణపై ఆర్కే

By narsimha lode  |  First Published Apr 13, 2022, 3:58 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. తాను జగన్ సైనికుడినని ఆయన చెప్పారు.  రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ వెంటనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. 


అమరావతి: తాను బతికినంత కాలం జగన్  జగన్ తోనే నడుస్తానని Mangalagiri ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గంలో  చోటు దక్కలేదని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై Alla Ramakrishna Reddy బుధవారం నాడు స్పందించారు. గత ఐదారు నెలలకు ముందే జగన్ మోహన్ రెడ్డి ని తాను కలిసిన విషయాన్ని గుర్తు చేసుకొన్నారు. ప్రజలు,జగనన్న ఆశీస్సులతో 151 ఎమ్మెల్యేలు గెలిచామన్నారు.

"

Latest Videos

50 మందికి పైగా రెడ్డి  సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వైసీపీలో  ఉన్నారన్నారు. మంత్రి పదవుల కేటాయింపులో రెడ్డి వర్గానికి ఇవ్వాల్సిన  ఆవశ్యకత ఉన్నప్పుడు మిగతా ప్రాంతాల నుండి ఒత్తిడి ఉంటే ముందు వారికే కేటాయించాలని తాను జగన్ కు చెప్పానన్నారు.పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా మంత్రి పదవికే కంటే జగనన్న మనస్సులో స్థానమే ముఖ్యమన్నారు.  పదవుల కోసం బాధపడాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. తాను జగనన్న సైనికుడినని చెప్పారు.రాజకీయాల్లో ఉంటే జగనన్నతోనే ఉంటానని రాజకీయాలు వదులుకుంటే తన పొలంలో పని చేసుకుంటానని గతంలోనే అసెంబ్లీ సాక్షిగా వెల్లడించానని ఆయన గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్తీకరించారు.11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించారు. 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. తొలుత అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. చివరకు విడుదల రజ.ని మంత్రిగా ప్రమాణం చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది.  సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు.అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు  వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పించారు.. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత రాజీనామా చేస్తానని ప్రకటించారు. మంత్రి పదవి దక్కని అసంతృప్తులను వైసీపి నాయకత్వం చల్లబరిచింది.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. .సీఎం జగన్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సోమవారం నాడు భేటీ అయ్యారు. పార్టీ పదవిని సీఎం అప్పగిస్తారని చెప్పారన్నారు. ఏ బాధ్యత ఇచ్చినా కూడా తాను సమర్ధవంతంగా నిరవహిస్తానని చెప్పారు. ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరితలతో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ  సమావేశమయ్యారు. ఇద్దరితో చర్చించారు.  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం నాడు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత సీఎంతో కూడా ఆయన భేటీ అయ్యారు. పార్టీ బాధ్యతలను తాను నిర్వహిస్తానని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. సామినేని ఉదయభాను కూడా నిన్ననే సీఎంతో భేటీ అయ్యారు. అయితే సీఎం చుట్టూ ఉన్న కోటరీ గురించి కూడా ఉదయభాను సీఎం వద్ద ఫిర్యాదు చేశారు.  ఇవాళ మాజీ  హోం మంత్రి సుచరిత సీఎంతో భేటీ అయ్యారు. 

click me!