స్నేహితుడి సలహా మేరకే అలా చేశా: నకిలీ చెక్కులతో సీఎంఆర్ఎఫ్ నిధుల డ్రా చేసిన భాస్కర్ రెడ్డి

By narsimha lodeFirst Published Sep 24, 2020, 5:31 PM IST
Highlights

సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణానికి సంబంధించిన సూత్రధారిని తానేనని భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు.


కడప: సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణానికి సంబంధించిన సూత్రధారిని తానేనని భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు.

సీఎంఆర్ఎఫ్ నిధులను నకిలీ చెక్కుల ద్వారా డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మూడు రాష్ట్రాల నుండి ఈ డబ్బులను డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

also read:సీఎంఆర్ఎఫ్ స్కాం: ఏప్రిల్ నుండి 16 వేల చెక్కుల జారీ

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే చెన్నకేశవరెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులను  తీసుకొన్నట్టుగా భాస్కర్ రెడ్డి చెప్పారు.

మూడు చెక్కుల ద్వారా సుమారు రూ. 10 లక్షలను డ్రా చేసినట్టుగా భాస్కర్ రెడ్డి చెప్పారు. కడప జిల్లాలోని చాపాడు మండటానికి చెందిన భాస్కర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్ ల గురించి వివరించారు.

తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్ లోని తన మిత్రుడి సలహా మేరకు తాను నకిలీ చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేసినట్టుగా ఆయన చెప్పారు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే  చెన్నకేశవ రెడ్డి నుండి మూడు పాత చెక్కులను తీసుకొని తన హోసూర్ లోని తన మిత్రుడికి పంపానని భాస్కర్ రెడ్డి మీడియాకు చెప్పారు.

ఈ చెక్కులను తన మిత్రుడు నకిలీ చెక్కులు చేసి పంపడంతో ఆ చెక్కులను బ్యాంకుల్లో వేసి రూ. 9 లక్షలను డ్రా చేసినట్టుగా ఆయన వివరించారు.ఈ మూడు చెక్కులు మినహా ఇతర చెక్కుల గురించి తనకు తెలియదన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన భాస్కర్ రెడ్డితో సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు  ఆరా తీస్తున్నారు. 

 


  

click me!