తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణమూర్తిపై న్యాయపోరాటం చేస్తానని ఏపీ మంత్రి రోజా చెప్పారు.
అమరావతి:చంద్రబాబు కేసు నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు బండారు సత్యనారాయణమూర్తి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ మంత్రి రోజా అభిప్రాయపడ్డారు.ఆదివారంనాడు ఏపీ మంత్రి రోజా అమరావతిలో మీడియాతో మాట్లాడారు. మంత్రిగా ఉన్న తనపైనే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు సత్యానారాయణమూర్తిపై న్యాయ పోరాటం చేస్తానని మంత్రి రోజా చెప్పారు.
చంద్రబాబు కుటుంబంపై ఏపీ మంత్రి రోజా చేసిన విమర్శలపై మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి స్పందించారు. ఈ క్రమంలో మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.సినిమాల్లో రోజా చేసిన పాత్రల గురించి వ్యాఖ్యానించారు. రోజా గురించి తాను బయటపెడితే ఆమె కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
undefined
also read:సీఎంపై అనుచిత వ్యాఖ్యలు: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్ (వీడియో)
రోజాపై చేసిన వ్యాఖ్యలపై గుంటూరు పోలీసులు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ పై కూడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలపై నమోదు చేసిన కేసులో ఈ నెల 2వ తేదీన రాత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో బండారు సత్యనారాయణమూర్తి అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చారు.
ఏపీ మంత్రి రోజాకు మద్దతుగా సినీ నటులు కుష్బూ,మీనా తదితరులు మద్దతుగా నిలిచారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణమూర్తి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.