మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై సినీనటి మీనా సీరియస్ అయ్యారు.
అమరావతి : సినీ నటి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై టిడిపి నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నారు. రోజా నీలి చిత్రాల్లో నటించిందంటూ సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రిపై వైసిపి నాయకులే కాదు సినీ నటీమణులు కూడా భగ్గుమంటున్నారు. ఇప్పటికే అలనాటి హీరోయిన్లు రమ్యకృష్ణ, ఖుష్భూ, రాధిక, నవనీత్ కౌర్ తదితరులు రోజాకు మద్దతుగా నిలవగా తాజాగా మీనా కూడా స్పందించారు.
సహచర నటి రోజాపై బండారు సత్యనారాయణమూర్తి చేసిన కామెంట్స్ తననెంతో బాధించడమే కాదు కోపాన్ని తెప్పించాయని మీనా పేర్కొన్నారు. ఒక ఆడది జీవితంలో ముందుకు సాగుతుంటే... రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోవడం దారుణమన్నారు. తప్పు చేయకున్నా నిందలు వేస్తే తలుపులు మూసుకుని ఏడ్చే రోజులు పోయాయని... కాలం మారిందని గుర్తుంచుకోవాలన్నారు. మహిళలు చాలా స్ట్రాంగ్ గా మారారని మీనా అన్నారు.
వీడియో
రోజా రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకే ఇంత చీప్ గా మాట్లాడుతున్నారని మీనా మండిపడ్డారు. మహిళ క్యారెక్టర్ ను దెబ్బతీసే చీప్ మెంటాలిటీ కలిగినవారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏ ప్రజల ముందయితే అసభ్యకరంగా మాట్లాడారో అదే ప్రజల ముందు టిడిపి నేత బండారు మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పాలని మీనా డిమాండ్ చేసారు.
Read More 'ఓ మహిళ పట్ల ఇంత నీచంగా మాట్లాడతారా.. ' : మంత్రి రోజాకు రమ్యకృష్ణ మద్దతు..
మహిళల పట్ల బండారు ఎంత దిగజారుడు భావనతో వున్నాడో రోజాపై చేసిన వ్యాఖ్యలను బట్టే అర్థమవుతుందని మీనా అన్నారు. ఇలా నీచంగా మాట్లాడితే మహిళలు భయపడతారు అనుకుంటున్నారా? అన్నారు. మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారుకి ఎవరిచ్చారని మీనా మండిపడ్డారు. వెంటనే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని... మరొకరు ఇలా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని మీనా డిమాండ్ చేసారు.
రోజా సినిమా ఇండస్ట్రీ కి వచ్చినప్పటి నుండి తనకు తెలుసన్నారు మీనా. కలిసి నటించిన వ్యక్తిగా ఆమేంటో తెలుసని... చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే దృఢమైన మహిళ రోజా అని అన్నారు. నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటిలోనూ రోజా సక్సెస్ అయ్యారన్నారు. అలాంటి దృడమైన మహిళకు మద్దతుగా నిలవడం ప్రతిఒక్కరి బాధ్యత.. తాను రోజా చేసే పోరాటానికి అండగా ఉంటానని మీనా తెలిపారు.