నన్ను తొక్కుకొంటూ వెళ్లారు, రాహుల్ చేయిచ్చారు: జేసీ

First Published Jul 21, 2018, 1:00 PM IST
Highlights

నా కొడుకు గెలుస్తాడనే  నమ్మకం ఉంటే, ప్రజా సేవ చేయగలుగుతాడనే విశ్వాసం కలిగితే  నా ఇంటికి వచ్చి టిక్కెట్టు ఇస్తారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. రాజీనామా నిర్ణయం గురించి త్వరలోనే వెల్లడిస్తానని ఆయన చెప్పారు.


న్యూఢిల్లీ: నా కొడుకు గెలుస్తాడనే  నమ్మకం ఉంటే, ప్రజా సేవ చేయగలుగుతాడనే విశ్వాసం కలిగితే  నా ఇంటికి వచ్చి టిక్కెట్టు ఇస్తారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. రాజీనామా నిర్ణయం గురించి త్వరలోనే వెల్లడిస్తానని ఆయన చెప్పారు.

రాజకీయాలనుండి తప్పుకోవాలని తాను  ఎప్పటి నుండో భావిస్తున్నానని  ఆయన చెప్పారు. ఈ మేరకు శనివారం నాడు  ఓ తెలుగున్యూస్ ఛానెల్‌తో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు.  ప్రజలకు మంచి చేయాలని భావిస్తే కూడ కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో దిగజారుడుతనం ఎక్కువైందన్నారు.

తన కొడుకును వైసీపీలో చేర్చేందుకు రాజీనామా  అంశాన్ని తెరమీదికి తెచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. పార్లమెంట్‌లో అవిశ్వాసం పూర్తైన సందర్భంగా  మీడియా తోపులాటలో  తాను కిందపడితే రాహుల్‌గాంధీ తనను లేపారని ఆయన గుర్తు చేశారు. మీడియా కారణంగానే తాను కిందపడినట్టు చెప్పారు. తనకు గాయాలైన విషయాన్ని ఆయన కెమెరాకు చూపారు.  మానవతా థృక్పథంతోనే రాహుల్ తనకు చేతిని ఇచ్చారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

తాను ఎవరి కోసమో రాజీనామాలు చేయడం లేదన్నారు. తనతో  ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిని పోల్చకూడదని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలకు మంచి చేయడం కూడ తప్పా అని ఆయన ప్రశ్నించారు.  తాను ఏం చేసినా కూడ ప్రజల కోసమే చేస్తానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అనంతపురంలో రోడ్లు వెడల్పు చేయాలన్నా ఇబ్బందులు సృష్టించడం తగునా అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు.తాను  ఏం చేసినా  ప్రజల కోసమే చేస్తానని దివాకర్ రెడ్డి ప్రకటించారు.


 

click me!