రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

First Published Jul 21, 2018, 12:37 PM IST
Highlights

 మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి  శనివారం నాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీలో చేరేందుకు ఆయన చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలను పార్టీలోని ఓ వర్గం నేతలు అడ్డుకోవడంతో  బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు.

న్యూఢిల్లీ: మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి  శనివారం నాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీలో చేరేందుకు ఆయన చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలను పార్టీలోని ఓ వర్గం నేతలు అడ్డుకోవడంతో  బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు.

శనివారం నాడు  న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ సమక్షంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరారు.  బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఆ పార్టీకి ప్రయోజనం కలుగుతోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

సుదీర్ఘకాలం పాటు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఆ జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలున్నాయి. అయితే టీడీపీలో చేరేందుకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బైరెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే  కాంగ్రెస్‌ పార్టీలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేరడం ఆ పార్టీకి  ప్రయోజనం ఉంటుందని  ఆ పార్టీ ఏపీ  నాయకులు భావిస్తున్నారు.ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలకు గాలం వేయడం ద్వారా  తమకు ప్రయోజనం కలిగే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.

రాహుల్ గాంధీ నేతృత్వంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.పార్టీని బలోపేతం చేసేందుకు  తన వంతు ప్రయత్నాలను చేయనున్నట్టు ఆయన చెప్పారు.
 

click me!