రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగనున్నారు.
అనంతపురం: ఈ ఏడాది ఏప్రిల్ జరిగే ఎన్నికల్లో కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు.
బుధవారం నాడు రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాయదుర్గం నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం నుండి కాపు రామచంద్రారెడ్డికి టిక్కెట్టు ఇవ్వలేనని వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. దీంతో వైఎస్ఆర్‌సీపీపై తీవ్ర అసంతృప్తితో ఆ పార్టీకి కాపు రామచంద్రారెడ్డి గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఇటీవలనే ప్రకటించారు.
undefined
also reaసీఎంఓకు క్యూ: వైఎస్ఆర్‌సీపీ మూడో జాబితాపై జగన్ కసరత్తుd:
ఈ నెల 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ నేత,మాజీ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డితో కాపు రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు.రెండు గంటల పాటు కాపు రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నట్టుగా కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. రాయదుర్గం నుండి తనకు ఆప్తులే బరిలోకి దిగుతారని ఆయన స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాలు తనకు రెండు కళ్ల వంటివని ఆయన చెప్పారు.
also read:మెత్తబడని మాజీ మంత్రి: తెలుగుదేశంలోకి మాజీ మంత్రి పార్థసారథి?
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తాను వై.ఎస్. షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. కాపు రామచంద్రారెడ్డి రఘువీరారెడ్డితో భేటీ కావడంతో ఆయన కూడ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతుంది.