జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్ తో భేటీ..!

Published : Jan 10, 2024, 01:28 PM ISTUpdated : Jan 10, 2024, 01:30 PM IST
జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్ తో భేటీ..!

సారాంశం

గుంటూరులో వైసీపీ నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’కు ఆయనను అంబాసిడర్ గా నియమించింది. గుంటూరు నుంచి ఎంపీ టికెట్ ఆశించారు అంబటి రాయుడు. 

గుంటూరు : కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారా అంటూ అవుననే వినిపిస్తోంది. వైసీపీలో చేరిన పది రోజులకే రాజీనామా చేసిన అంబటి రాయుడు ఆ తరువాత తాను దుబాయ్ టోర్నమెంటులో పాల్గొంటున్నట్లు ట్వీట్ చేశారు. కానీ ఇంతలోనే జనసేనలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

గుంటూరులో వైసీపీ నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’కు ఆయనను అంబాసిడర్ గా నియమించింది. గుంటూరు నుంచి ఎంపీ టికెట్ ఆశించారు అంబటి రాయుడు. అయితే, వైసీపీలో సర్వేల ఆధారంగా టికెట్ల విషయంలో కఠినంగా ఉంటున్న వైఎస్ జగన్ గుంటూరు టికెట్ అంబటి రాయుడికి ఇవ్వలేమన్న సమాచారంతో రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఇవ్వాళ, రేపట్లో జనసేనలో చేరతారని, పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారని సమాచారం.వైసీపీకి రాజీనామా చేసిన వారంలోపే జనసేనలో చేరతారని వెలుగు చూడడంతో ఇప్పుడీ అంశం సంచలనంగా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మా ఆరడుగుల బుల్లెట్..! : Home Minister Anitha POWERFUL Speech | CM Chandrababu | Asianet News Telugu
కొండ‌ల‌ను చీల్చి గోదావ‌రిని తీసుకొచ్చిన ఇంజ‌నీరింగ్ అద్భుతం.. పోల‌వ‌రం ఎడ‌మ కాలువ నిర్మాణం