మౌనం వీడిన కొండ్రు మురళి: టీడీపీలో చేరికపై ఏం చెప్పారంటే...!

By narsimha lodeFirst Published Aug 26, 2018, 3:28 PM IST
Highlights

టీడీపీలో చేరుతున్నట్టు మాజీ మంత్రి కొండ్రు మురళి తన అనుచరులకు స్పష్టత ఇచ్చారు. పార్టీ మారే విషయమై అనుచరులతో చర్చించారు. ఆదివారం నాడు ముఖ్య అనుచరులతో సమావేశమైన మురళి ఆగష్టు 31వ తేదీన టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

శ్రీకాకుళం: టీడీపీలో చేరుతున్నట్టు మాజీ మంత్రి కొండ్రు మురళి తన అనుచరులకు స్పష్టత ఇచ్చారు. పార్టీ మారే విషయమై అనుచరులతో చర్చించారు. ఆదివారం నాడు ముఖ్య అనుచరులతో సమావేశమైన మురళి ఆగష్టు 31వ తేదీన టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

టీడీపీలో చేరాలని కొంత కాలంగా కొండ్రు మురళి తెర వెనుక మంతనాలు సాగిస్తున్నారు. మురళిని టీడీపీలో చేర్చుకొనేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కూడ సానుకూలతను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్న టీడీపీ నాయకత్వాన్ని కూడ చంద్రబాబునాయుడు పార్టీలో కొండ్రు మురళిని చేర్చుకొనే విషయమై చర్చించారు.

అయితే కొండ్రు మురళి టీడీపీలో చేరడాన్ని మాజీ స్పీకర్, మాజీ మంత్రి ప్రతిభా భారతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో కొండ్రు మురళికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయింపు విషయమై ఇబ్బంది ఉండకపోవచ్చిన కూడ టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తన అనుచరులతో కొండ్రు మురళి ఆదివారం నాడు సమావేశమయ్యారు. ఏ పరిస్థితుల కారణంగా టీడీపీలో చేరాల్సి వస్తోందనే విషయమై మురళి పార్టీ కార్యకర్తలకు వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు ఈ సమావేశంలో మురళి ప్రకటించారు. ఆగష్టు 31 వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి కళా వెంకట్రావు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.


ఈ వార్తలు చదవండి

కాంగ్రెస్‌కు షాక్: ఆగష్టు 31న టీడీపీలోకి కొండ్రు మురళి, త్వరలోనే మరికొందరు

ఏపీలో కాంగ్రెస్‌కు భారీ షాక్: టీడీపీలోకి క్యూ కడుతున్న నేతలు

click me!