జ్యోతుల నెహ్రూకు పరామర్శ.. మా ఇద్దరిది 40 ఏళ్ల అనుబంధమన్న చంద్రబాబు

Siva Kodati |  
Published : Aug 27, 2021, 07:15 PM ISTUpdated : Aug 27, 2021, 07:29 PM IST
జ్యోతుల నెహ్రూకు పరామర్శ.. మా ఇద్దరిది 40 ఏళ్ల  అనుబంధమన్న చంద్రబాబు

సారాంశం

టీడీపీ సీనియర్ నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యోతుల నెహ్రూని ఈరోజు చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వద్దకు వెళ్లి యోగక్షేమాలను తెలుసుకున్నారు.  

టీడీపీ సీనియర్ నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యోతుల నెహ్రూని ఈరోజు చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వద్దకు వెళ్లి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

తమ ఇద్దరిదీ నలభై సంవత్సరాల అనుబంధమని ఆయన చెప్పారు. ప్రజాప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే నేత నెహ్రూ అని కితాబునిచ్చారు. పోలవరం నిర్వాసితుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ, అందులో భాగంగా ఢిల్లీకి వెళ్లి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అనారోగ్యం పాలయ్యారని చంద్రబాబు చెప్పారు. ఇలాంటి పోరాటయోధులు పార్టీకి ఎంతో అవసరమని టీడీపీ అధినేత అన్నారు. నెహ్రూగారు త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు తిరిగి రావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ఆకాంక్షించారు.

 

PREV
click me!

Recommended Stories

MLA Viral Video: ఎమ్మెల్యే రాస‌లీలలు.? ఈ వీడియోలో ఉంది నిజంగానే జ‌న‌సేన నాయ‌కుడా.?
IMD Rain Alert : కేరళ తీరంలో అల్పపీడనం... ఈ ప్రాంతాల్లో వర్షాలు