తూ.గోదావరిలో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,09,245కి చేరిక

Published : Aug 27, 2021, 05:05 PM IST
తూ.గోదావరిలో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,09,245కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1515 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 20,09,245 కి చేరుకొన్నాయి.  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,788కి చేరింది. గడిచిన 24 గంటల్లో 903 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 90వేల 407 మంది కోలుకొన్నారు. 

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో68,855 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1515 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,09,245 కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,788కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 903 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 90వేల 407 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 15,050 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,64,06,811 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో026,చిత్తూరులో 199, తూర్పుగోదావరిలో223,గుంటూరులో129,కడపలో 089, కృష్ణాలో163, కర్నూల్ లో013, నెల్లూరులో202, ప్రకాశంలో 1232,విశాఖపట్టణంలో 079,శ్రీకాకుళంలో061, విజయనగరంలో 056,పశ్చిమగోదావరిలో 143 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో 10 మంది చనిపోయారు.చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురి చొప్పున కరోనాతో చనిపోయారు.కర్నూల్,  తూర్పుగోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,788కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,056, మరణాలు 1091
చిత్తూరు-2,37,222, మరణాలు1832
తూర్పుగోదావరి-2,84,974, మరణాలు 1254
గుంటూరు -1,72,042,మరణాలు 1176
కడప -1,12,356, మరణాలు 629
కృష్ణా -1,13,237,మరణాలు 1295
కర్నూల్ - 1,23,752,మరణాలు 848
నెల్లూరు -1,39,666,మరణాలు 994
ప్రకాశం -1,33,214, మరణాలు 1041
శ్రీకాకుళం-1,21,894, మరణాలు 777
విశాఖపట్టణం -1,54,718, మరణాలు 1102
విజయనగరం -82,325, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,73,894, మరణాలు 1080.


 

PREV
click me!

Recommended Stories

Republic Day Celebrations 2026: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పీచ్ | Asianet Telugu
Republic Day Celebrations in Amaravati: చంద్రబాబుకి పవన్ కి లోకేష్ ఘన స్వాగతం| Asianet News Telugu