
వైసీపి నేత శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరులు తనపై దాడికి దిగారని అభిరుచి మధు ఆరోపించారు. తమ ఆత్మరక్షణ కోసం గన్ మెన్ కాల్పులు జరిపారని ఆయన తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని అభిరుచి మధు అన్నారు. నంద్యాల కాల్పుల ఘటన సందర్భంగా మధు మీడియాతో మాట్లాడారు.
నేడు ఉదయం సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద వైసీపి నేతలు తమను అడ్డుకున్నారని, తాము మాజీ కౌన్సిలర్ భర్త భాషా ఇటీవలే మృతి చెందారని, ఆయనకు నివాళి అర్పించేందుకు తాను వస్తున్న విషయం చక్రపాణిరెడ్డికి తెలిసిందని, ఒక పక్క ప్లాన్ తో తనను ఎటాక్ చేయాలనే ఉద్దేశంతో వంద మంది రౌడీలతో వచ్చారని ఆయన ఆరోపించారు. శిల్పా వర్గీయులు రాళ్లతో, వెపన్లతో దాడి చేశారని, తన కారు అద్దాలు పగులగొట్టారని ఆరోపించారు. తనను చంపడానికే వాళ్లు ప్లాన్ వేసుకుని వచ్చారని మధు అన్నారు. తమకు ప్రభుత్వం భద్రతా చర్యలు చెపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మధు చెప్పేది ఎలా ఉన్నా... ఇక్కడే కొన్ని సందేహాలు తలెత్తున్నాయి.. ఎందుకంటే, ఘటన జరగిన వెంటనే చక్రపాణి చెప్పిన వర్షన్ కి విరుద్దంగా మధు చెబుతున్నారు. చక్రపాణి రెడ్డి కూడా కౌన్సలర్ అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా. ఘటన జరిగిందన్నారు. అంటే చక్రపాణి రెడ్డి కోసం మధు తన మద్దతుధారులతో కాపు కాసిన విషయం అర్థం అవుతుంది. ఎప్పుడైతే చక్రపాణి రెడ్డిని గుర్తించారో వెంటనే వాహానాలతో అటకాయించారు, వారి వాహానాలు రొడ్డులో అడ్డుపెట్టడంతో చక్రపాణి రెడ్డి కారులోంచి దిగారు, దాని తరువాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే.. అయితే తన పై దాడి చెయ్యడానికే చక్రపాణి రెడ్డి కాపు కాచినట్లు మధు చెబుతున్నారు. కత్తులు పట్టుకొని, తుపాకితో కాల్పులు మధు జరిపాడనేందుకు వీడియోలే ఆధారాలు.
మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి