గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరే విషయం నాకు తెలియదు: బొత్స

Published : Jun 20, 2018, 02:46 PM ISTUpdated : Jun 20, 2018, 02:56 PM IST
గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరే విషయం నాకు తెలియదు: బొత్స

సారాంశం

గంటా వైసీపీలో చేరే విషయం తెలియదు


విశాఖపట్టణం: మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తున్న విషయం తనకు తెలియదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పార్టీ విధానాలు నచ్చి ఎవరు పార్టీలోకి వచ్చినా  వారిని ఆహ్వానం పలుకుతామని ఆయన చెప్పారు. అయితే వైసీపీలో చేరడానికి ముందే  తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన చెప్పారు.

బుధవారం నాడు  విశాఖలో  ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30వ తేదిన  వంచనపై గర్జనపేరుతో  అనంతపురంలో సభ నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సభ జరుగుతోందని ఆయన చెప్పారు. వచ్చే నెల 15వ తేదిన వైస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించనున్నట్టు ఆయన చెప్పారు. 

నాయిబ్రహ్మణుల పట్ల చంద్రబాబునాయుడు తీరు బాగోలేదన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరును బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. నీతి ఆయోగ్ సమావేశంలో  ఏం జరిగిందనే విషయాలను  బయటపెట్టాలని  బాబును బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే