విశ్వభారతి హాస్పిటల్‌ వద్ద హైడ్రామా.. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వచ్చిన సీబీఐ.. వైసీపీ శ్రేణుల హంగామా

By Asianet NewsFirst Published May 22, 2023, 8:23 AM IST
Highlights

కర్నూల్ లోని విశ్వ భారతి హాస్పిటల్ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు రావడంతో అక్కడికి వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

కర్నూలులోని  విశ్వభారతి హాస్పిటల్‌ వద్ద హైడ్రామా నెలకొంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని సీబీఐ నిర్ణయించింది. దీని కోసం విశ్వ భారతి హాస్పిటల్ వద్దకు చేరుకుంది. అయితే ఇక్కడ వైసీపీ శ్రేణులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

మార్కులు తక్కువ వచ్చాయని ఆరేళ్ల చెల్లెని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లి.. కోటి రూపాయిలు కావాలంటూ మెసేజ్..

అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు రావడంతో ఆమె విశ్వ భారతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. కాగా.. పలు కారణాలు చెబుతూ సీబీఐ విచారణకు ఆయన గైర్హాజరు అవుతుండటంతో అరెస్టు చేయాలని ఆ దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. ఈ విషయాన్ని కడప ఎస్పీకి తెలియజేశారు. సోమవారం ఉదయమే సీబీఐ అధికారులు హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన సమాచార అందడంతో వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు.

విషాదం.. బావి శుభ్రం చేస్తుండగా వెలువడిన విష వాయువులు.. ముగ్గురు మృతి 

అయితే వైసీపీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ కార్యకర్తలు అక్కడ హంగామా సృష్టించారు. సీబీఐ ఆఫీసర్ల వెహికిల్స్ హాస్పిటల్ లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాగా.. అంతకు ముందు కవరేజీ కోసం మీడియా ప్రతినిధులు హాస్పిటల్ కు చేరుకున్నారు. వారిపై కూడా ఎంపీ అనుచరులు దాడికి ఒడిగట్టారు. మీడియా సిబ్బందితో గొడవకు దిగారు. ఈ క్రమంలో ముగ్గురు మీడియా ప్రతినిధులకు గాయాలవడతో పాటు కెమెరాలు కూడా దెబ్బతిన్నాయి.  ఇదిలా ఉండగా.. తాను సోమవారం కూడా విచారణకు హాజరుకాలేనని, తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకు తన న్యాయవాదుల ద్వారా సమాచారం అదించారు.  
 

click me!