2034 వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలి - హైకోర్టులో పిటిషన్

By Sairam IndurFirst Published Mar 3, 2024, 2:53 PM IST
Highlights

2034 జూన్ 2వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా ఆస్తులు, అప్పుల సమస్యలు పరిష్కారం కాలేదని, కాబట్టి హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్ల పాటు కొనసాగించాలని పిటిషనర్ పేర్కొన్నారు. 

హైదరాబాద్ ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్ల పాటు కొనసాగించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్ ను 2034 వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అందులో ఆ పిటిషనర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదలి అనిల్ కుమార్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.

కొమ్మపై ఆధారపడే పక్షిని కాదు.. రెక్కలతో స్వతహాగా ఎగురగలను - బీజేపీ ఎంపీ సంచనల వ్యాఖ్యలు

ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి ఉన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన అసంపూర్తిగా ఉండటమే తన పిటిషన్ కు కారణమని అనిల్ కుమార్ పేర్కొన్నారు.

వావ్.. హైదరాబాద్ లక్క గాజులకు జీఐ ట్యాగ్

కేంద్ర ప్రభుత్వం అశాస్రీయ విధానాన్ని అనుసరించిందని అనిల్ కుమార్ పేర్కొన్నారు. అందుకే రెండు రెండు రాష్ట్రాలు విడిపోయి పది సంవత్సరాలు దాటిని ఇప్పటికీ ఏపీకి రాజధాని లేకుండా పోయిందని తెలిపారు. తెలంగాణ, ఏపీ మధ్య ఆస్తుల, అప్పుల సమస్యలు ఇంకా మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పటికీ.. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యిందని ఆరోపించారు. విభజన చట్టం నిబంధనలు సరిగా అమలు కాలేదని, అందుకే హైదరాబాద్ ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరారు.

ఐపీఎల్ 2024... స్టార్ ఆటగాళ్లతో ప్రోమో వీడియో రిలీజ్.. వైరల్

కాగా.. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం 2024 జూన్ 2 వరకు మాత్రమే హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది.పదేళ్ల పాటు మాత్రమే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని అని చట్టంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పదేళ్ల వ్యవధిలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసే వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ రాజధానిగా కొనసాగింది. అయితే దీన్ని విశాఖకు తరలించాలని జగన్ మోహన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా.. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ పంజాబ్ పునర్విభజన చట్టం ప్రకారం 1966 నుంచి పంజాబ్, హర్యానా రెండింటికీ, ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతోంది. 

click me!