Ysrcp Manifesto: వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్..  ఎప్పుడంటే..? 

By Rajesh Karampoori  |  First Published Mar 3, 2024, 5:39 AM IST

Ysrcp Manifesto: మరోసారి అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో అధికార వైసీపీ అడుగులేస్తుంది. ఈ మేరకు మార్చి 10న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 


Ysrcp Manifesto: మరోసారి అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో అధికార వైసీపీ అడుగులేస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుని మరోసారి సీఎం పీఠాన్ని అధిష్టించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఈ  మేరకు 'సిద్ధం' (Ysrcp Siddham)పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలకు చేరువ కావాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో  ఓటర్లు ఆకర్షించేలా మేనిఫెస్టో(Ysrcp Manifesto) సిద్దం చేశారు. ఈ మేనిఫెస్టోను ఈ నెల బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిర్వహించి సిద్ధం సభలో విడుదల చేయాలని వైసీపీ ముహూర్తం ఖరారు చేసినట్టు చేస్తుంది.  ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున వచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ఈ సభ ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(MP Vijayasai Reddy) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఈ సిద్దం సభకు సంబంధించిన పోస్టర్ ను శనివారం ఒంగోలులో విడుదల చేశారు. అలాగే.. ఈ సభకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. మేదరమెట్ల సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేస్తారని ప్రకటించారు. మేదరమెట్ల సభకు తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది హాజరవుతారని విజయసాయిరెడ్డి తెలిపారు. గత నాలుగేళ్ల 10 నెలల కాలంలో ప్రజలకు ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏం చేసిందో ముఖ్యమంత్రి ప్రజలకు తెలియజేస్తారని, వారికి అవగాహన కల్పిస్తారని తెలిపారు.

Latest Videos

ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వచ్చే ఐదేళ్లలో ప్రజలకు మెరుగైన పాలన అందించడంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి హైలైట్ చేస్తారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ బహిరంగం ఆ తరువాత సీఎం జగన్ నియోజకవర్గాల వారిగా పర్యటిస్తారని తెలిపారు. అలాగే .. 25 ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళ్తుందని, సిద్ధం సభలతో వైసీపీ గ్రాఫ్ మరింత పెరిగిందనీ, ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణ కూడా పెరిగిందని విజయసాయి రెడ్డి అన్నారు.
 
మార్చి 13 లేదా మార్చి 14న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించి ఎన్నికల సీజన్‌కు ముందే వైఎస్సార్‌సీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఆయన సూచించారు. ఈ సమావేశం కోసం 100 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. అవసరమైతే వేదికకు ఆనుకుని ఉన్న మరో 100 ఎకరాలను సిద్ధం మహాసభకు వినియోగించుకోవచ్చు. సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు, ప్రకాశం జిల్లాల సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, మంత్రులు మేగు నాగార్జున, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

click me!