ప్రజారాజ్యంపై జనసేనలో ఆసక్తికర చర్చ

By narsimha lodeFirst Published May 12, 2019, 6:09 PM IST
Highlights

ప్రజారాజ్యం పార్టీలో ఆనాడు చోటు చేసుకొన్న పరిణామాలను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  పార్టీ నేతలతో పంచుకొన్నారు.

అమరావతి: ప్రజారాజ్యం పార్టీలో ఆనాడు చోటు చేసుకొన్న పరిణామాలను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  పార్టీ నేతలతో పంచుకొన్నారు. ప్రజారాజ్యం మాదిరిగానే జనసేనను కూడ ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం జరిగిన విషయాన్ని కూడ పవన్  ఈ సమావేశంలో ఆయన ప్రస్తావించారని సమాచారం.

ఆదివారం నాడు అమరావతిలో జనసేన  పార్టీ అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.  ప్రజారాజ్యం గురించి ఆసక్తికర  చర్చ జరిగిందని జనసేన వర్గాలు తెలిపాయి. 

ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు.. కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేనాటికి చోటు చేసుకొన్న పరిణామాలను కూడ పవన్ ఈ సమావేశంలో వివరించారు.ప్రజారాజ్యం పార్టీపై ఉద్దేశ్యపూర్వకంగా కుట్రలు చేసిన వైనాన్ని కూడ పవన్ కళ్యాణ్ వివరించారు.ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఎన్నో పాఠాలను నేర్చుకొన్నానని పవన్ నేతలకు వివరించారు.

ప్రజా రాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో  పార్టీలో చేరిన వారంతా ఎక్కువగా ఆశతో వచ్చినవారేనని ఆయన చెప్పారు.జనసేన కూడ ఓ ఆశయంతో ఏర్పాటైనట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.

మార్పు మొదలైందని..... ఇది అసెంబ్లీలో కన్పిస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు.  ఎంత పోరాటం చేశామనేది ముఖ్యమన్నారు.  ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో ముఖ్యం కాదన్నారు. కానీ, ఒట్ల షేరింగ్ ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల అనుభవాలు, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పవన్ అడిగి తెలుసుకున్నారు. త్వరలో ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పర్యటించే అవకాశం ఉంది. 

click me!