ప్రేమ పెళ్లి... కాపురానికి తీసుకెళ్లిన మొదటిరోజే భార్యను చంపిన భర్త

Arun Kumar P   | Asianet News
Published : Jan 31, 2021, 09:41 AM IST
ప్రేమ పెళ్లి... కాపురానికి తీసుకెళ్లిన మొదటిరోజే భార్యను చంపిన భర్త

సారాంశం

ప్రేమించి పెళ్లిచేసుకున్న ప్రియురాలిపైనే అనుమానాన్ని పెంచుకున్న ఓ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు.

నెల్లూరు: ప్రేమించుకోవడమే కాదు పెద్దలను ఒప్పించి ఆ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లారు. అయితే ఇలా పెళ్లిచేసుకున్న ప్రియురాలిపై అనుమానాన్ని పెంచుకున్న భర్త దారుణానికి ఒడిగట్టాడు. కాపురానికి తీసుకెళ్లిన రోజే అతి కిరాతకంగా భార్యను హతమార్చాడు. ఈ దారుణం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  కొవ్వూరులోని ఓ స్వీట్ షాప్ లో పరిచేసే కోడి హరికృష్ణ, నార్తురాజుపాళెంలోని మరో స్వీట్ షాప్ లో పనిచేసే స్రవంతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కొన్నేళ్ళుగా సాగిన వీరి ప్రేమ పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లివరకు వెళ్లింది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరిద్దరి పెళ్లి  గతేడాది జూన్‌ 10న పల్లాప్రోలు రామాలయంలో జరిగింది. 

అయితే వివాహం జరిగిన తరువాత కేవలం రెండ్రోజులు మాత్రమే స్రవంతి అత్తింట్లో వుంది. ఆషాడ మాసం పేరుతో పుట్టింటికి వెళ్లిన స్రవంతిని ఏడు నెలలుగా పుట్టింట్లోనే వుంటోంది.  ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే ఆమెపై అనుమానం పెంచుకుని దూరం పెట్టాడు. అంతటితో ఆగకుండా స్రవంతిని హతమార్చడానికి పూనుకున్నాడు భర్త హరికృష్ణ.

ఈ క్రమంలోనే భార్యను తన ఇంటికి తీసుకుని వెళతానని నమ్మించి స్రవంతిని తనవెంట తీసుకువెళ్లాడు హరికృష్ణ. ఇలా కాపురానికి తీసుకెళ్లిన రోజు రాత్రి స్రవంతి గొంతుకోసి అతి కిరాతకంగా హతమార్చాడు. కూతురి హత్య గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హరిని అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: అక్క‌డ వ‌ర్షాలు, ఇక్కడ చ‌లి.. బ‌ల‌ప‌డుతోన్న అల్ప పీడ‌నం
CM Nara Chandrababu Naidu: మహిళా సంఘాలకు చెక్కులను అందజేసిన సీఎం చంద్రబాబు| Asianet News Telugu