పంచాయితీల ఏకగ్రీవాలు... వైఎస్ భారతి పేరిట ఘరానా మోసానికి యత్నం

By Arun Kumar PFirst Published Jan 31, 2021, 8:42 AM IST
Highlights

సోషల్ మీడియాలో వైస్ భారతి పేరును వాడుకుని ఏకంగా వైసిపి ఎమ్మెల్యేలను మోసం చేయాలనుకున్నాడో ఘరానా మోసగాడు. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల వేళ ఘరానా మోసానికి  ప్రయత్నించిన ఓ నిందితుడిని సీఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికన సీఎం వైఎస్ జగన్ భార్య భారతి పేరిట ఏకంగా అధికార వైసిపి పార్టీ ఎమ్మెల్యేలకు టోకరా వేయడానికి ప్రయత్నించిన ఓ యువకుడు కటకటాలపాలయ్యాడు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి  అప్రమత్తతతో ఇంకా ఎలాంటి నష్టం జరక్కుండాని ఈ మోసం భయటపడింది.    

వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా సీతానగరం మండలం గాదెలవలసకు చెందిన రాజాన పోలినాయుడు అలియాస్‌ వేణుగోపాలనాయుడు(28) రాష్ట్రంలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలను క్యాష్ చేసుకోవాని భావించాడు. ఇందుకోసం సోషల్ మీడియాలో వైస్ భారతి పేరును వాడుకుని వైసిపి ఎమ్మెల్యేలను మోసం చేయాలనుకున్నాడు. తన ప్లాన్ లో భాగంగా వైఎస్‌ భారతి ఆదేశాల మేరకు డాక్టర్‌ వైఎస్సాఆర్‌ ట్రస్టు పేరిట ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.5లక్షలు, వైసీపీ తరపున అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయితే రూ.6 లక్షలు ప్రోత్సహకంగా ఇవ్వనున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్టింగ్స్‌ పెట్టాడు. ఈ పోస్ట్ ని ఎమ్మెల్యేల సోషల్ మీడియా అకౌంట్లకు పంపాడు. 

అయితే ఇలా డాక్టర్‌ వైఎస్సాఆర్‌ ట్రస్టు నుండి ఏకగ్రీవ పంచాయితీలు ప్రోత్సాహక నగదు పొందాలంటే ముందుగా రూ.5వేలు అకౌంట్ లో జమచేయాలని పేర్కొన్నాడు. దీంతో ఇది మోసపూరిత పోస్టింగ్ అని గ్రహించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడి పోలీసులు నిందితుడిని తెనాలిలో అరెస్ట్ చేశారు. నిందితుడిపై 420, 465, 468, 469, 471, 120బీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు

click me!