చిత్తూరు జిల్లాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. షెడ్యూల్ ఇదే..!!

Siva Kodati |  
Published : Jan 30, 2021, 09:32 PM IST
చిత్తూరు జిల్లాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. షెడ్యూల్ ఇదే..!!

సారాంశం

ఒకరోజు పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్ చిత్తూరు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 7న రానున్న రాష్ట్రపతి జిల్లాకు రానున్నారు. 

ఒకరోజు పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్ చిత్తూరు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 7న రానున్న రాష్ట్రపతి జిల్లాకు రానున్నారు.

వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌లో ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 12;10 గంటలకు రామ్‌నాథ్ కోవింద్ మదనపల్లికి చేరుకోనున్నారు. 12:30 గంటలకు స్థానిక ఆశ్రమం చేరుకొని వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

అనంతరం 3:20కు మదనపల్లి నుంచి బయలుదేరి 3:40 సదుం చేరుకొంటారు. అక్కడ పిపల్ గ్రూప్ స్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.

అనంతరం అక్కడి నుంచి 4:50 గంటలకు బెంగుళూరుకు బయలుదేరుతారు. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శనివారం రోజు జిల్లా అధికారులు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు