భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త: తానూ ప్రయత్నించి, చివరకు పోలీసుల ముందుకు...

Published : May 08, 2021, 06:58 AM ISTUpdated : May 08, 2021, 06:59 AM IST
భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త: తానూ ప్రయత్నించి, చివరకు పోలీసుల ముందుకు...

సారాంశం

నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి చివరకు పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. కరోనా కారణంగా ఇది జరిగింది.

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యను భర్త బ్లేడుతో కోసి హత్య చేశాడు. కావలిలోని సంక్లవారి తోట పరిధిలోని గోరింకపాలెం వీధిలో నివాసం ఉంటున్న అనురాధ (30) దంపతులకు 13 రోజుల క్రితం కరోనా వైరస్ సోకింది.

దాంతో వారు పిల్లలను తమ బంధువులకు పంపించి, వారు ఇంట్లోనే హోం క్వారంటైన్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో అనురధాకు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఏర్పడింది. 108, 104 వాహనాలకు సమాచారం అందించినా ఫలితం లేకుండా పోయింది. ఆ వాళ్లు రాలేదు. 

స్థానిక అధికారులకు చెప్పినా ఫలితం దక్కలేదు. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఇరువురు కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. మల్యాద్రి మద్యం సేవించి ఇంట్లో ఉన్న బ్లేడుతో అనురాధ మణికట్టుపై విచక్షణారహితంగా కోసాడు. ఆ తర్వాత తన ఎడమ చేతి మణికట్టుపై కొంత మేరకు కోసుకుని బయటకు వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ఒకటో పట్టణం పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూశారు. అప్పటికే అనురాధ మరణించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu