రాయలసీమ పవర్ ప్లాంట్‌లో మరణ మృదంగం.. 10 రోజుల్లో 14 మంది ఉద్యోగులు బలి

By Siva KodatiFirst Published May 7, 2021, 9:22 PM IST
Highlights

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈరోజు మరో ముగ్గురు ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గడిచిన పది రోజుల నుండి ఇప్పటి వరకు 14 మంది ప్లాంట్ ఉద్యోగులు కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈరోజు మరో ముగ్గురు ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గడిచిన పది రోజుల నుండి ఇప్పటి వరకు 14 మంది ప్లాంట్ ఉద్యోగులు కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. 

ఆర్టీపీపీ‌లో అనధికారికంగా 200 మంది కరోనా రోగులు వున్నట్లు సమాచారం. దీంతో థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉద్యోగులు భయం భయంగా గడుపుతున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో వీరంతా హైదరాబాదు, కర్నూల్ తదితర ప్రాంతాల్లో చికిత్స తీసుకుంటున్నారు. అక్కడే ఆరోగ్యం విషమించడంతో మరణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. మృతుల్లో ఇంజినీర్లు, అకౌంట్ సెక్షన్, జూనియర్ ప్లాట్ అసిస్టెంట్లు ఉన్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం వుందని సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. 

Also Read:ఏపీలో కాస్త తగ్గిన కరోనా జోరు: కొత్తగా 17,188 కేసులు.. చిత్తూరులో అదే తీవ్రత

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కాస్తంత నెమ్మదించింది. గడిచిన కొన్నిరోజులుగా రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్న చోట ఈ వేళ స్వల్పంగా  తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,188 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 12,45,374కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 73 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8,519కి చేరుకుంది.

click me!